Breaking News

సెమీస్‌లో సింధు 

Published on Sat, 01/10/2026 - 05:18

కౌలాలంపూర్‌: మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోరీ్నలో భారత స్టార్‌ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ అకానె యామగుచి (జపాన్‌)తో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్‌ సింధు తొలి గేమ్‌ను 13 నిమిషాల్లో 21–11తో సొంతం చేసుకుంది. 

అనంతరం ప్రపంచ మూడో ర్యాంకర్‌ అకానె యామగుచి గాయం కారణంగా మ్యాచ్‌ నుంచి వైదొలిగింది. దాంతో సింధును విజేతగా ప్రకటించారు. ఈ గెలుపుతో ముఖాముఖి రికార్డులో యామగుచిపై సింధు ఆధిక్యం 15–12కు పెరిగింది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ వాంగ్‌ జి యి (చైనా)తో సింధు ఆడుతుంది. 

ముఖాముఖి రికార్డులో సింధు 3–2తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 10–21, 21–23తో ఫజర్‌ అల్ఫియాన్‌–షోహిబుల్‌ ఫిక్రీ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన సాతి్వక్‌–చిరాగ్‌లకు 9,062 డాలర్ల (రూ. 8 లక్షల 17 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6600 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)