Breaking News

చాంపియన్‌ పంజాబ్‌

Published on Sun, 08/10/2025 - 04:26

చెన్నై: జాతీయ సబ్‌ జూనియర్‌ పురుషుల హాకీ చాంపియన్‌షిప్‌లో పంజాబ్‌ జట్టు చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో పంజాబ్‌ 4–3 గోల్స్‌ తేడాతో జార్ఖండ్‌ జట్టును ఓడించింది. తొలి క్వార్టర్‌లో రెండు జట్లు ఖాతా తెరవలేకపోయాయి. రెండో క్వార్టర్‌లో జార్ఖండ్‌ దూకుడు పెంచి మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేసి 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 21వ నిమిషంలో ఆశిష్‌ గోల్‌తో ఖాతా తెరిచిన జార్ఖండ్‌... 24వ నిమిషంలో అనీశ్‌ డుంగ్‌డుంగ్‌ గోల్‌తో 2–0తో ముందంజ వేసింది. 

అయితే పంజాబ్‌ కూడా తగ్గేదేలే అన్నట్లు ఆడింది. నిమిషం తేడాలో రెండు గోల్స్‌ చేసి స్కోరును 2–2తో సమం చేసింది. 29వ నిమిషంలో అక్షిత్‌ సలారియా గోల్‌తో బోణీ కొట్టిన పంజాబ్, 30వ నిమిషంలో వరీందర్‌ సింగ్‌ గోల్‌తో స్కోరును సమం చేసింది. 42వ నిమిషంలో సుఖు గురియా గోల్‌తో జార్ఖండ్‌ 3–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడు నిమిషాల తర్వాత మన్‌దీప్‌ సింగ్‌ (45వ నిమిషంలో) గోల్‌తో పంజాబ్‌ స్కోరును 3–3తో సమం చేసింది. 

మ్యాచ్‌ మరో ఏడు నిమిషాల్లో ముగుస్తుందనగా మన్‌దీప్‌ సింగ్‌ (53వ నిమిషంలో) గోల్‌ చేసి పంజాబ్‌కు 4–3తో ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత పంజాబ్‌ ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని టైటిల్‌ను దక్కించుకుంది. అంతకుముందు జరిగిన కాంస్య పతక పోరులో ఉత్తరప్రదేశ్‌ 5–3 గోల్స్‌ తేడాతో మధ్యప్రదేశ్‌ను ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)