Breaking News

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ విజేతగా పంజాబ్‌..

Published on Mon, 11/06/2023 - 21:26

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2023 విజేతగా పంజాబ్‌ జట్టు నిలిచింది. సోమవారం మొహాలీ వేదికగా జరిగిన ఫైనల్లో బరోడాను ఓడించిన పంజాబ్‌.. తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది. 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 203 పరుగులు మాత్రమే చేయగల్గింది. బరోడా బ్యాటర్లలో అభిమన్యు సింగ్(61), కెప్టెన్‌ కృనాల్‌ పాండ్యా(45) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు.

పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 4 వికెట్లతో అదరగొట్టగా.. కౌల్‌, బ్రార్‌, మార్కండే తలా వికెట్‌ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో అన్మోల్‌ప్రీత్ సింగ్ మెరుపు సెంచరీతో చెలరేగాడు.

61 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 113 పరుగులు చేశాడు. అతడితో పాటు వాదేరా(61) పరుగులతో ఆఖరిలో అదరగొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేశాడు. బరోడా బౌలర్లలో కృనాల్‌ పాండ్యా, సోపారియా, సేథ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)