Breaking News

గాయత్రి–ట్రెసా జోడీ శుభారంభం

Published on Thu, 06/05/2025 - 02:27

జకార్తా: ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల డబుల్స్‌ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–14, 22–20తో పొలీనా బురోవా–యెవెనియా కాంటెమిర్‌ (ఉక్రెయిన్‌) జంటపై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తొలి గేమ్‌ను అలవోకగా సొంతం చేసుకోగా... రెండో గేమ్‌లో గట్టిపోటీ ఎదుర్కొంది. 

నేడు జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో యుకీ ఫుకుషిమా–మయు మత్సుమోటో (జపాన్‌)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. గద్దె రుతి్వక శివాని–రోహన్‌ కపూర్‌; తనీషా క్రాస్టో–ధ్రువ్‌ కపిల; అశిత్‌ సూర్య–అమృత జోడీలు తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టగా... సతీశ్‌ కుమార్‌ కరుణాకరన్‌–ఆద్య వరియత్‌ ద్వయం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. 

సతీశ్‌–ఆద్య జోడీ 15–21, 21–16, 21–17తో యె హోంగ్‌ వె–నికోల్‌ గొంజాలెస్‌ చాన్‌ (చైనీస్‌ తైపీ) జంటపై విజయం సాధించింది. రుత్విక–రోహన్‌ 14–21, 9–21తో యుచి షిమోగామి–సయాక హొబారా (జపాన్‌) చేతిలో, అశిత్‌–అమృత 15–21, 9–21తో మాడ్స్‌ వెస్టెర్‌గార్డ్‌–క్రిస్టిన్‌ బుష్‌ (డెన్మార్క్‌) చేతిలో, తనీషా–ధ్రువ్‌ 11–21, 21–16, 14–21తో టాంగ్‌ జి చెన్‌–ఈ వె తో (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు.  

కిరణ్‌ జార్జి ఓటమి 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత పోరాటం ముగిసింది. తొలి రోజు మంగళవారం లక్ష్య సేన్, ప్రణయ్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా... రెండో రోజు బుధవారం కిరణ్‌ జార్జి కూడా తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. ప్రపంచ మాజీ చాంపియన్‌ లో కీన్‌ యె (సింగపూర్‌)తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్‌ జార్జి 20–22, 9–21తో ఓడిపోయాడు. 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)