Breaking News

మెరిసిన పృథ్వీరాజ్‌

Published on Sun, 01/26/2025 - 03:52

పుదుచ్చేరి: రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా పుదుచ్చేరితో జరుగుతున్న పోరులో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 209/5తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పుదుచ్చేరి జట్టు 79 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆంధ్ర జట్టుకు 43 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. పుదుచ్చేరి బ్యాటర్‌ అమాన్‌ ఖాన్‌ (50) అర్ధశతకం సాధించాడు. 

ఆంధ్ర బౌలర్లలో పృథ్వీరాజ్‌ 5 వికెట్లు పడగొట్టగా... విజయ్‌ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. మొహమ్మద్‌ రఫీ, శశికాంత్, లలిత్‌ మోహన్‌ తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆంధ్ర జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 69 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.

 కరణ్‌ షిండే (136 బంతుల్లో 86 బ్యాటింగ్‌; 9 ఫోర్లు; 1 సిక్స్‌) అజేయ అర్ధశతకంతో సత్తా చాటగా... శ్రీకర్‌ భరత్‌ (41; 7 ఫోర్లు), షేక్‌ రషీద్‌ (26; 3 ఫోర్లు), రికీ భుయ్‌ (32; 5 ఫోర్లు, 1 సిక్స్‌), శశికాంత్‌ (39 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) రాణించారు. పుదుచ్చేరి బౌలర్లలో అంకిత్‌ శర్మ 2 వికెట్లు తీశాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 5 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు ఓవరాల్‌గా 291 పరుగుల ఆధిక్యంలో ఉంది.  

స్కోరు వివరాలు 
ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌: 303; పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్‌: శ్రీధర్‌ రాజు (సి) శ్రీకర్‌ భరత్‌ (బి) పృథ్వీరాజ్‌ 0; జయ్‌ పాండే (బి) పృథ్వీరాజ్‌ 3; పారస్‌ (సి) శ్రీకర్‌ భరత్‌ (బి) పృథ్వీరాజ్‌ 39; ఆకాశ్‌ (సి) శ్రీకర్‌ భరత్‌ (బి) శశికాంత్‌ 7; మోహిత్‌ కాలె (సి) రషీద్‌ (బి) పృథ్వీరాజ్‌ 60; అరుణ్‌ కార్తీక్‌ (సి) రికీ భుయ్‌ (బి) పృథ్వీరాజ్‌ 59; అమాన్‌ ఖాన్‌ (సి) రికీ భుయ్‌ (బి) లలిత్‌ మోహన్‌ 50; అంకిత్‌ శర్మ (సి) శ్రీకర్‌ భరత్‌ (బి) విజయ్‌ 13; సాగర్‌ (సి) రషీద్‌ (బి) విజయ్‌ 0; అబిన్‌ మాథ్యూ (నాటౌట్‌) 4; గౌరవ్‌ యాదవ్‌ (సి) అభిషేక్‌ రెడ్డి (బి) రఫీ 16; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (79 ఓవర్లలో ఆలౌట్‌) 260. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–20, 4–84, 5–148, 6–225, 7–237, 8–238, 9–241, 10–260, బౌలింగ్‌: పృథ్వీరాజ్‌ 23–5–64–5; మొహమ్మద్‌ రఫీ17–1–53–1; శశికాంత్‌ 15–0–57–1; లలిత్‌ మోహన్‌ 16–2–42–1; విజయ్‌ 8–0–36–2. 
ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌: అభిషేక్‌ రెడ్డి (ఎల్బీ) (బి) గౌరవ్‌ యాదవ్‌ 15; శ్రీకర్‌ భరత్‌ (ఎల్బీ) (బి) అంకిత్‌ శర్మ 41; షేక్‌ రషీద్‌ (రనౌట్‌) 26; కరణ్‌ షిండే (బ్యాటింగ్‌) 86; రికీ భుయ్‌ (సి) (సబ్‌) సీజీడీ శాస్త్రి (బి) అమన్‌ ఖాన్‌ 32; హనుమ విహారి (సి) శ్రీధర్‌ రాజు (బి) అంకిత్‌ శర్మ 0; శశికాంత్‌ (బ్యాటింగ్‌) 39; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (69 ఓవర్లలో 5 వికెట్లకు) 248. వికెట్ల పతనం: 1–24, 2–81, 3–82, 4–141, 5–142, బౌలింగ్‌: గౌరవ్‌ యాదవ్‌ 10–1–49–1; అబిన్‌ మాథ్యూ 11–3–34–0; సాగర్‌ 21–3–72–0; అంకిత్‌ శర్మ 22–3–56–2; అమాన్‌ ఖాన్‌ 3–0–25–1; 
ఆకాశ్‌ 2–1–11–0. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)