Breaking News

ఐఓఏలో వైరం... ఎస్‌జీఎం చక్కదిద్దేనా?

Published on Fri, 10/04/2024 - 03:51

న్యూఢిల్లీ: భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ)లోని సహచరులతో ఏర్పడిన వైరంతో ఇబ్బంది పడుతున్న ఐఓసీ అధ్యక్షురాలు పీటీ ఉష ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)ను ఏర్పాటు చేసింది. ఈ నెల 25న జరగబోయే ఈ మీటింగ్‌లో సమస్యలు, విబేధాలు, ఇతరత్రా అంశాలపై చర్చిద్దామని ఆమె పేర్కొంది. ‘వివాదానికి దారి తీసిన అంశాలు, అసాధారణ సమస్యలు... ఇలా అన్నింటిపై చర్చించేందుకు ఎస్‌జీఎం నిర్వహించాలని నిర్ణయించాను. 

ఈ నెల 25న ఆఫీస్‌ బేరర్లు, స్టేక్‌ హోల్డర్లంతా హాజరు కావాలని కోరుతున్నాను. ఈ ఎస్‌జీఎం హైబ్రిడ్‌ మీటింగ్‌. అంటే నియమావళిలోని ఆర్టికల్‌ 8.3 ప్రకారం ఎవరైనా సభ్యులు ప్రత్యక్షంగా హాజరు కాలేని పరిస్థితి ఉంటే ఆన్‌లైన్‌ మీటింగ్‌ ద్వారా కూడా పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన లింక్‌ ఐఓఏ వెబ్‌సైట్‌లో ఉంటుంది’ అని ఉష ఐఓఏ సభ్యులకు ఈ–మెయిల్‌ పంపారు. ముఖ్యంగా ఒలింపిక్‌ సంఘానికి సీఈఓగా రఘురామ్‌ అయ్యర్‌ను నియమించడాన్ని ఎగ్జిక్యూటివ్‌ (ఈసీ) సభ్యులు ఏమాత్రం జీరి్ణంచుకోలేకపోతున్నారు. 

తాము ఎంతగా వ్యతిరేకించినా ఆయనకు పదవిని కట్టబెట్టడంపై ఈసీ సభ్యులంతా గుర్రుగా ఉన్నారు. కోశాధికారి సహదేవ్‌ యాదవ్‌పై వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలు కూడా చర్చనీయాంశమైంది. ఈ లుకలుకలతో ఐఓఏ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. మరోవైపు ఐఓఏను ఒక ప్రొఫెషనల్‌ దృక్పథంలో నడిపించేందుకు సీఈఓ అవసరం ఎంతో ఉందని ఉష వాదిస్తోంది. 

అయ్యర్‌కు సీఈఓ పదవేమీ పూర్తిగా కొత్తేం కాదు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్, లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీలతో పాటు ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ లీగ్, అల్టీమేట్‌ టేబుల్‌ టెన్నిస్‌ (యూటీటీ)లకు సీఈఓ పనిచేసిన విశేషానుభవం రఘురామ్‌ అయ్యర్‌ సొంతం. ఐఓఏ నిర్వహించే ఎస్‌జీఎంలో స్పోర్ట్స్‌ కోడ్‌పై కూడా చర్చ జరిగే అవకాశముంది. గరిష్ట వయోపరిమితిపై ప్రధానంగా చర్చిస్తారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)