నిప్పులు చెరిగిన హసన్‌ అలీ.. టిమ్‌ సీఫర్ట్‌ మెరుపులు

Published on Wed, 03/06/2024 - 18:25

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో ఇవాళ (మార్చి 6) జరిగిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గ్లాడియేటర్స్‌.. హసన్‌ అలీ (4-0-15-4), బ్లెస్సింగ్‌ ముజరబానీ (4-0-27-2), జహీద్‌ మెహమూద్‌ (4-0-25-2), మీర్‌ హమ్జా (3.1-0-25-1) ధాటికి 19.1 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది.

గ్లాడియేటర్స్‌ ఇన్నింగ్స్‌లో సౌద్‌ షకీల్‌ (33) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. జేసన్‌ రాయ్‌ (15), ఖ్వాజా నఫే (17), రిలీ రొస్సో (10), అకీల్‌ హొసేన్‌ (14) రెండంకెల స్కోర్లు చేశారు. బిగ్‌ హిట్టర్‌ షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (9), సర్ఫరాజ్‌ ఖాన్‌ (7), ఆమిర్‌ (2), హస్నైన్‌ (5), ఉస్మాన్‌ తారిక్‌ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. 

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కరాచీ కింగ్స్‌.. 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. టిమ్‌ సీఫర్ట్‌ (31 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. షోయబ్‌ మాలిక్‌ (27 నాటౌట్‌) కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.

మధ్యలో జేమ్స్‌ విన్స్‌ (27) పర్వాలేదనిపించగా.. కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ (7) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. గ్లాడియేటర్స్‌ బౌలర్లలో అకీల్‌ హొసేన్‌, మొహమ్మద్‌ ఆమిర్‌, అబ్రార్‌ అహ్మద్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)