Breaking News

సికందర్‌ రజా సునామీ ఇన్నింగ్స్‌.. వరుసగా నాలుగో విజయం

Published on Fri, 03/03/2023 - 11:24

Pakistan Super League 2023: పాకిస్తాన్‌ సూపర్‌లీగ్‌-2023లో లాహోర్‌ ఖలండర్స్‌ వరుసగా నాలుగో విజయం సాధించింది. క్వెటా గ్లాడియేటర్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సికందర్‌ రజా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టుకు గెలుపు అందించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో గురువారం రాత్రి లాహోర్‌ ఖలండర్స్‌, క్వెటా గ్లాడియేటర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన క్వెటా గ్లాడియేటర్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ సర్ఫరాజ్‌ నమ్మకాన్ని నిర్ణయానికి సార్థకత చేకూరుస్తూ.. క్వెటా బౌలర్లు అదరగొట్టారు.

ఉమైద్‌ అసీఫ్‌ లాహోర్‌ ఓపెనర్లు మీర్జా బేగ్‌(2), ఫఖర్‌ జమాన్‌(రనౌట్‌)లను తక్కువ స్కోర్లకే పరిమితం చేసి శుభారంభం అందించాడు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ షఫీక్‌ 15 పరుగులు చేయగా, వికెట్‌ కీపర్‌ సామ్‌ బిల్లింగ్స్‌ (2) పూర్తిగా నిరాశపరిచాడు.

ఐదో స్థానంలో వచ్చిన హుసేన్‌ తలట్‌ కూడా కేవలం ఆరు పరుగులు చేసి నిష్క్రమించగా.. ఆరోస్థానంలో వచ్చిన కెప్టెన్‌ షాహిన్‌ ఆఫ్రిది 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇలా వరుస వికెట్లు కోల్పయి జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ సికందర్‌ రజా తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు.

34 బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి లాహోర్‌ 148 పరుగుల మెరుగైన స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. క్వెటా బౌలర్లలో నసీం షా, ఓడియన్‌ స్మిత్‌, ఉమైద్‌ అసీఫ్‌ ఒక్కో వికెట్‌ తీయగా.. నవీన్‌ ఉల్‌ హక్‌, మహ్మద్‌ నవాజ​ రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెటా గ్లాడియేటర్స్‌ను లాహోర్‌ బౌలర్లు హారిస్‌ రవూఫ్‌(3 వికెట్లు), రషీద్‌ ఖాన్‌(2 వికెట్లు) దెబ్బ కొట్టారు. వీరికి తోడు డేవిడ్‌ వీస్‌ ఒక వికెట్‌తో రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన క్వెటా గ్లాడియేటర్స్‌ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పటి వరకు ఒకే ఒక్క గెలుపు నమోదు చేసిన క్వెటా గ్లాడియేటర్స్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

చదవండి: Ind Vs Aus 3rd Test: ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. రోహిత్‌ సేనపై 9 వికెట్ల తేడాతో విజయం
IND vs AUS: ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్‌.. చూస్తే వావ్‌ అనాల్సిందే! వీడియో వైరల్‌

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)