Breaking News

రచ్చరచ్చ చేసిన మహ్మద్‌ రిజ్వాన్‌, రిలీ రొస్సో

Published on Sat, 02/18/2023 - 14:18

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ వరుసగా రెండో విజయం సాధించింది. పెషావర్‌ జల్మీతో నిన్న (ఫిబ్రవరి 17) జరిగిన మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సుల్తాన్స్‌ కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (42 బంతుల్లో 66; 9 ఫోర్లు, సిక్స్‌), వన్‌డౌన్‌ బ్యాటర్‌ రిలీ రొస్సో (36 బంతుల్లో 75; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) రచ్చరచ్చ చేయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సుల్తాన్స్‌ 3 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

మిల్లర్‌ (14 బంతుల్లో 23 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌), పోలార్డ్‌ (6 బంతుల్లో 15 నాటౌట్‌; 2 ఫోర్లు,సిక్స్‌) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. పెషావర్‌ బౌలర్లలో సల్మాన్‌ ఇర్షాద్‌ 2, సుఫీయాన్‌ ముకీమ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. అనంతరం​ బరిలోకి దిగిన పెషావర్‌.. సుల్తాన్స్‌ బౌలర్లు ఉసామా (3/22), ఇహసానుల్లా (3/24), అబ్బాస్‌ అఫ్రిది (2/33), కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (1/22) ధాటికి 18.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది.

అరంభంలో ఓపెనర్‌ మహ్మద్‌ హరీస్‌ (23 బంతుల్లో 40; ఫోర్‌, 4 సిక్సర్లు), వన్‌డౌన్‌ బ్యాటర్‌ సయిమ్‌ అయూబ్‌ (37 బంతుల్లో 53; 3 సిక్సర్లు, 3 ఫోర్లు) కాసేపు మెరుపులు మెరిపించి ఔటయ్యారు. వీరు కాక రోవమన్‌ పావెల్‌ (23), జేమ్స్‌ నీషమ్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. సుల్తాన్స్‌ ప్లేయర్‌ రొస్సో వరుసగా రెండో మ్యాచ్‌లో మెరుపు హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. లీగ్‌లో ఇవాల్టి (ఫిబ్రవరి 18) మ్యాచ్‌లో కరాచీ కింగ్స్‌, క్వెట్టా గ్లాడియేటర్స్‌ తలపడనున్నాయి.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)