Breaking News

మార్టిన్‌ గప్తిల్‌ వీరవిహారం.. 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో..

Published on Tue, 03/07/2023 - 08:04

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023లో క్వెట్టా గ్లాడియేటర్స్‌ 5 మ్యాచ్‌ల తర్వాత ఓ మ్యాచ్‌లో విజయం సాధించింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన గ్లాడియేటర్స్‌.. 2 విజయాలు, 6 పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. కరాచీ కింగ్స్‌తో నిన్న (మార్చి 6) జరిగిన మ్యాచ్‌లో గ్లాడియేటర్స్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కరాచీ కింగ్స్‌.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. గ్లాడియేటర్స్‌ 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ (56 బంతుల్లో 86; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయమైన అర్ధసెంచరీతో గ్లాడియేటర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. గప్తిల్‌కు మరో ఎండ్‌ నుంచి ఎవరి సపోర్ట్‌ లేనప్పటికీ, ఒంటరి పోరాటం​చేసి తన జట్టును గెలిపించుకున్నాడు.

గప్తిల్‌కు సర్ఫరాజ్‌ అహ్మద్‌ (29), మహ్మద్‌ నవాజ్‌ (15),  డ్వేన్‌ ప్రిటోరియస్‌ (10 నాటౌట్‌) నుంచి ఓ మోస్తరు మద్దతు లభించింది. కరాచీ బౌలర్లలో తబ్రేజ్‌ షంషి 2 వికెట్లు పడగొట్టగా.. ఆమెర్‌ యామిన్‌, ముహ్మద్‌ మూసా, జేమ్స్‌ ఫుల్లర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అంతకుముందు కరాచీ ఇన్నింగ్స్‌లో రొస్సింగ్టన్‌ (45 బంతుల్లో 69; 10 ఫోర్లు, సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో మెరవగా.. ఇమాద్‌ వసీం (30 నాటౌట్‌), ఆమెర్‌ యామిన్‌ (23 నాటౌట్‌) పర్వాలేదనిపించారు. గ్లాడియేటర్స్‌ బౌలర్లలో నసీం షా, ఐమల్‌ ఖాన్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్‌ నవాజ్‌, నవీన్‌ ఉల్‌ హక్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

లీగ్‌లో భాగంగా ఇవాళ (మార్చి 7) డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం  2:30 గంటలకు పెషావర్‌ జల్మీ-లాహోర్‌ ఖలందర్స్‌ తలపడనుండగా.. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ఇస్లామాబాద్‌-ముల్తాన్‌ సుల్తాన్స్‌  అమీతుమీ తేల్చుకోనున్నాయి.  

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు