Breaking News

షంషి, షోయబ్‌ మాలిక్‌ మాయాజాలం​.. రిజ్వాన్‌ జట్టుకు ఊహించని షాక్‌

Published on Sun, 02/26/2023 - 18:39

PSL 2023: పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2023 సీజన్‌లో మహ్మద్‌ రిజ్వాన్‌ సారథ్యంలోని ముల్తాన్‌ సుల్తాన్స్‌కు రెండో ఓటమి ఎదురైంది. ప్రస్తుత సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన సుల్తాన్స్‌ ఆ తర్వాత వరుసగా 4 విజయాలు సాధించి, ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన 6వ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ప్రస్తుత సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న రిజ్వాన్‌.. ఈ మ్యాచ్‌లో విఫలం కావడంతో సుల్తాన్స్‌ ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా 75, 28 నాటౌట్‌, 66, 50, 110 నాటౌట్‌, 29 స్కోర్లు చేసిన రిజ్వాన్‌.. ఈ ఒక్క మ్యాచ్‌లోనే నిరుత్సాహపరిచాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ముల్తాన్‌ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్‌ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌.. మాథ్యూ వేడ్‌ (46), జేమ్స్‌ విన్స్‌ (27), తయ్యబ్‌ తాహిర్‌ (65) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా, ఛేదనలో సుల్తాన్స్‌ 101 పరుగులకే చాపచుట్టేయడంతో ఓటమిపాలైంది.

సుల్తాన్స్‌ ఇన్నింగ్స్‌లో షాన్‌ మసూద్‌ (25), మహ్మద్‌ రిజ్వాన్‌ (29), అన్వర్‌ అలీ (12), ఉసామా అలీ (10) మినహా మిగతవారు కనీసం రెండంకెల స్కోర్‌ కూడా చేయలేకపోయారు. తబ్రేజ్‌ షంషి (3/18), షోయబ్‌ మాలిక్‌ (3/18), అకీఫ్‌ జావిద్‌ (2/8), ఇమాద్‌ వసీం (2/34) పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు సుల్తాన్స్‌ను కట్టడి చేయడంలోనూ సఫలమయ్యారు. అంతకుముందు ముల్తాన్స్‌ బౌలర్లు  ఇహసానుల్లా 2 వికెట్లు, అన్వర్‌ అలీ ఓ వికెట్‌ పడగొట్టారు. పీఎస్‌ఎల్‌లో ఇవాళ రాత్రి లాహోర్‌ ఖలందర్స్‌-పెషావర్‌ జల్మీ తలపడనున్నాయి.    


 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)