Breaking News

తుస్సుమన్న షాహీన్‌ అఫ్రిది.. మెరిసిన జేమ్స్‌ విన్స్‌, మాథ్యూ వేడ్‌

Published on Mon, 02/20/2023 - 13:12

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2023 సీజన్‌లో కరాచీ కింగ్స్‌ బోణీ కొట్టింది. ఈ సీజన్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన కింగ్స్‌ ఎట్టకేలకు నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించింది. లహోర్‌ ఖలందర్స్‌తో నిన్న (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ 67 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది.

ఈ  మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌.. ఓపెనర్లు మాథ్యూ వేడ్‌ (24 బంతుల్లో 36; 4 ఫోర్లు, సిక్స్‌), జేమ్స్‌ విన్స్‌ (36 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ ఇమాద్‌ వసీం (19 బంతుల్లో 35 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. లాహోర్‌ బౌలర్లలో కెప్టెన్‌ షాహీన్‌ అఫ్రిది, జమాన్‌ ఖాన్‌, హరీస్‌ రౌఫ్‌, లియామ్‌ డాసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అఫ్రిది వికెట్‌ పడగొట్టినప్పటికీ ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 

అనంతరం 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఖలందర్స్‌.. కింగ్స్‌ బౌలర్లు అకీఫ్‌ జావిద్‌ (4/28), అమెర్‌ యామిన్‌ (2/18), బెన్‌ కట్టింగ్‌ (2/12), మహ్మద్‌ అమీర్‌ (1/12) ధాటికి 17.3 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. ఖలందర్స్‌ ఇన్నింగ్స్‌లో మీర్జా తాహిర్‌ బేగ్‌ (39 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. కమ్రాన్‌ గులామ్‌ (23), సికందర్‌ రజా (18), ఫకర్‌ జమాన్‌ (15) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముల్తాన్‌ సుల్తాన్స్‌ టాప్‌లో (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు) ఉండగా.. కరాచీ కింగ్స్‌ (4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు), ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు), క్వెట్టా గ్లాడియేటర్స్‌ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు), పెషావర్‌ జల్మీ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు), లాహోర్‌ ఖలందర్స్‌ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు) వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో ఉన్నాయి. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ క్వెట్టా గ్లాడియేటర్స్‌, పెషావర్‌ జల్మీ తలపడనున్నాయి.   

Videos

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)