Breaking News

బెంగళూర్‌ బుల్స్‌ రెండో విక్టరీ

Published on Mon, 11/04/2024 - 22:34

4 నవంబర్‌ 2024 : ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో ఆడిన తొలి ఆరు మ్యాచుల్లో ఐదింట పరాజయాలు చవిచూసిన బెంగళూర్‌ బుల్స్‌.. ఎట్టకేలకు సీజన్లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కెప్టెన్‌ పర్దీప్‌ నర్వాల్‌ బరిలో లేకపోయినా.. బలమైన తమిళ్‌ తలైవాస్‌పై 36-32తో నాలుగు పాయింట్ల తేడాతో బెంగళూర్‌ బుల్స్‌ ఉత్కంఠ విజయం సాధించింది. సోమవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన పీకెఎల్‌ 11 లీగ్‌ దశ మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ తడబాటుకు గురైంది. సీజన్లో ఆరు మ్యాచులు ఆడిన తమిళ్‌ తలైవాస్‌కు ఇది రెండో పరాజయం. బెంగళూర్‌ బుల్స్‌ ఆటగాళ్లలో అజింక్య పవార్‌ (6 పాయింట్లు), అక్షిత్‌ (6 పాయింట్లు), సురిందర్‌ దెహల్‌ (5 పాయింట్లు) రాణించారు. తమిళ్ తలైవాస్‌ తరఫున నరందర్‌ (6 పాయింట్లు), సచిన్‌ (5) రాణించారు. 

బెంగళూర్‌ పైచేయి : వరుస పరాజయాలు చవిచూసిన బెంగళూర్‌ బుల్స్‌.. సోమవారం తమిళ్‌ తలైవాస్‌తో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసింది. డిఫెండర్లు అంచనాలకు మించి రాణించటంతో ప్రథమార్థం ఆటలో తమిళ్‌ తలైవాస్‌పై బెంగళూర్‌ బుల్స్‌ ఓ పాయింట్‌ ఆధిక్యం సాధించింది. రెయిడర్లు అజింక్య పవార్‌, జై భగవాన్‌ కూతలో మెప్పించారు. డిఫెండర్లు సౌరభ్‌ నందల్‌, సురిందర్‌ దెహల్‌ మెరుపు ట్యాకిల్స్‌ చేశారు. తమిళ్ తలైవాస్‌ సైతం రెయిడ్‌లో కాస్త నిరాశపరిచినా.. డిఫెన్స్‌లో మెప్పించింది. ఉత్కంఠగా సాగిన తొలి 20 నిమిషాల ఆటలో బెంగళూర్‌ బుల్స్‌ 14-13తో పైచేయి సాధించింది.

సెకండ్‌హాఫ్‌లో తమిళ్‌ తలైవాస్‌ పుంజుకుంది. డిఫెండర్ల జోరుకు.. రెయిడర్లు సైతం జత కలిశారు. దీంతో తమిళ్‌ తలైవాస్‌ వేగంగానే కోలుకుంది. చివరి పది నిమిషాల ఆటలో ఏకంగా మూడు పాయింట్ల ముందంజలో నిలిచిన తమిళ్‌ తలైవాస్‌.. ఆ తర్వాత నిరాశపరిచింది. 36వ నిమిషంలో 26-26తో స్కోరు సమం చేసింది బెంగళూర్‌ బుల్స్‌. ఆఖరు ఐదు నిమిషాల్లో తలైవాస్‌ను ఆలౌట్‌ చేసి 29-26తో మూడు పాయింట్ల ఆధిక్యం సాధించింది బుల్స్‌. ఆఖరు వరకు అదే జోరు కొనసాగించిన బెంగళూర్‌ బుల్స్‌ 36-32తో తమిళ్‌ తలైవాస్‌ను బోల్తా కొట్టించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)