Breaking News

పట్నా పైరేట్స్‌ సూపర్‌ షో

Published on Sat, 11/02/2024 - 21:49

హైదరాబాద్‌: పీకెఎల్‌ మూడుసార్లు చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో ముచ్చటగా మూడో విజయం సాధించింది. శనివారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన లీగ్‌ దశ మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై 42-37తో పట్నా పైరేట్స్‌ పైచేయి సాధించింది.  రెయిడింగ్‌లో, డిఫెన్స్‌లో హవా చూపించిన పైరేట్స్‌ 5 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌ను చిత్తు చేసింది. పట్నా పైరేట్స్‌ రెయిడర్ దేవాంక్‌ (11 పాయింట్లు) సూపర్‌ టెన్‌ షోతో మెరువగా.. అయాన్‌ ( 9 పాయింట్లు) అదరగొట్టాడు. యూపీ యోధాస్‌ ఆటగాళ్లలో గగన్‌ గౌడ (9 పాయింట్లు), భరత్‌ (6 పాయింట్లు) , సురేందర్‌ గిల్‌(5 పాయింట్లు) రాణించినా ఆ జట్టుకు సీజన్లో మూడో పరాజయం తప్పలేదు.

పైరేట్స్‌ ముందంజ : 
యూపీ యోధాస్‌, పట్నా పైరేట్స్‌ మ్యాచ్‌లో మూడుసార్లు ప్రథమార్థంలో ముందంజ వేసింది. తొలి 20 నిమిషాల ఆటలో 23-19తో నాలుగు పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది.  పైరేట్స్‌ ఆధిక్యం సాధించినా.. ప్రథమార్థం హోరాహోరీగా సాగింది. రెయిడింగ్‌, డిఫెన్స్‌లో ఇరు జట్లు తగ్గ పోటీనిచ్చాయి.  దీంతో ఇరు జట్లు ఆలౌట్‌ సైతం చవిచూశాయి.  డిఫెన్స్‌లో పైచేయి సాధించిన పట్నా పైరేట్స్‌.. తొలి అర్థభాగం ఆటను ఖాతాలో వేసుకుంది. కెప్టెన్‌ శుభమ్‌ షిండె మెరుపు ట్యాకిల్స్‌తో అదరగొట్టాడు. రెయిడర్‌ దేవాంక్‌ సహజంగానే తనదైన జోరు కొనసాగించాడు.

యోధాస్‌కు నిరాశ : 
ఆట ద్వితీయార్థంలో యూపీ యోధాస్‌ పుంజుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రథమార్థం ఆధిక్యం కొనసాగించిన పట్నా పైరేట్స్‌.. ఓ దశలో ఏడు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. యూపీ యోధాస్‌ రెయిడర్లు సురేందర్‌ గిల్‌, గగన్‌ గౌడ సహా ఆల్‌రౌండర్‌ భరత్‌ వరుసగా పాయింట్లు సాధించారు. యూపీ యోధాస్‌ను ఆఖరు వరకు రేసులో నిలపాలని చూశారు. ఇదే సమయంలో పట్నా పైరేట్స్‌ సైతం పాయింట్ల వేటలో దూకుడు చూపించింది. దేవాంక్‌కు అయాన్‌ సైతం జత కలవటంతో పట్నా పైరేట్స్‌ ఏ దశలోనూ ఆధిక్యం కోల్పోలేదు. ఆఖరు రెయిడ్‌లోనూ రెండు పాయింట్లు సాధించిన అయాన్‌ పట్నా పైరేట్స్‌కు మెరుపు విజయాన్ని అందించాడు. ద్వితీయార్థంలో యూపీ యోధాస్‌ 18 పాయింట్లు సాధించగా, పట్నా పైరేట్స్‌ 19 పాయింట్లు ఖాతాలో వేసుకుంది.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)