Breaking News

PKL 2024: పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌

Published on Fri, 10/25/2024 - 23:06

హైదరాబాద్‌, 25 అక్టోబర్‌ 2024 : మాజీ చాంపియన్‌ పుణెరి పల్టాన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్లో ముచ్చటగా మూడో విజయం సాధించింది. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో బెంగళూర్‌ బుల్స్‌పై పుణెరి పల్టాన్‌ 14 పాయింట్ల తేడాతో ఏకపక్ష విజయం నమోదు చేసింది. జట్టుగా రాణించటంలో పూర్తిగా విఫలమైన బెంగళూర్‌ బుల్స్‌ సీజన్లో వరుసగా నాల్గో మ్యాచ్‌లో చేతులెత్తేసింది. 36-22తో బెంగళూర్‌ బుల్స్‌పై పుణెరి పల్టాన్‌ ఏకపక్ష విజయం సాధించింది.

 పల్టాన్‌ తరఫున పంకజ్‌ మోహితె (6 పాయింట్లు), మోహిత్‌ గోయత్‌ (6 పాయింట్లు) రాణించారు. బెంగళూర్‌ బుల్స్‌ ఆటగాళ్లలో పంకజ్‌ (6 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. బెంగళూర్‌ బుల్స్‌కు ఏదీ కలిసి రావటం లేదు. హ్య్రాటిక్‌ పరాజయాలు చవిచూసిన బుల్స్‌.. నాల్గో మ్యాచ్‌లోనూ ఏమాత్రం మారలేదు. కెప్టెన్‌ పర్దీప్‌ నర్వాల్‌ పేలవ ప్రదర్శన ఆ జట్టుకు ప్రతికూలంగా మారింది. శుక్రవారం పుణెరి పల్టాన్‌తో మ్యాచ్‌లో బుల్స్‌ పూర్తిగా తేలిపోయింది. తొలి అర్థభాగం ఆటలో ఆ జట్టు 11-18తో నిలిచింది. 

తొలి పది నిమిషాల ఆటలో ఆ జట్టు పాయింట్లు రెండెంకలకు చేరుకోలేదు. ప్రథమార్థంలో చివర్లో పంకజ్‌ మెరుపులతో బుల్స్‌ 11 పాయింట్ల వరకు చేరుకుంది. మరోవైపు పల్టాన్‌ ఆటగాళ్లు పంకజ్‌ మోహితె, మోహిత్‌ గోయత్‌లకు కెప్టెన్‌ అస్లాం ఇనామ్‌దార్‌ (5 పాయింట్లు), గౌరవ్‌ ఖత్రి (4 పాయింట్లు), ఆమన్‌ (4 పాయింట్లు) జతకలిశారు. 

మ్యాచ్‌ రెండో అర్థభాగంలో బెంగళూర్‌ బుల్స్‌ ప్రదర్శన కాస్త మెరుగైనా.. ఏ దశలోనూ పుణెరి పల్టాన్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. విరామం అనంతరం సైతం మెరుపు ప్రదర్శన పునరావృతం చేసిన పుణెరి పల్టాన్‌ చివరి 20 నిమిషాల ఆటలోనూ 18-11తో బుల్స్‌ను చిత్తు చేసింది. దీంతో పుణెరి పల్టాన్‌ 36-22తో బెంగళూర్‌పై అలవోక విజయం సాధించింది. సీజన్లలో పుణెరి పల్టాన్‌కు ఇది నాలుగు మ్యాచుల్లో మూడో విజయం. ఈ విక్టరీతో పీకెఎల్‌ 11 పాయింట్ల పట్టికలో పుణెరి పల్టాన్‌ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. వరుసగా నాల్గో పరాజయంతో బెంగళూర్‌ బుల్స్‌ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)