Breaking News

PKL 2024: దేవాంక్‌ సూపర్‌ షో

Published on Fri, 10/25/2024 - 21:41

హైదరాబాద్‌, పట్నా పైరేట్స్‌ స్టార్‌ రెయిడర్‌ దేవాంక్‌ కండ్లుచెదిరే కూతతో రికార్డులు తిరగరాశాడు. కూతకెళ్లి ఏకంగా 25 పాయింట్లు సాధించిన దేవాంక్‌ ఒంటిచేత్తో మూడు సార్లు చాంపియన్‌ పట్నా పైరేట్స్‌కు ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో తొలి విజయం అందించాడు. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ 42-40తో ఉత్కంఠ విజయం సాధించింది. 

మ్యాచ్‌లో ఆది నుంచి ఆధిక్యంలో కొనాసాగిన తమిళ్ తలైవాస్‌ హ్యాట్రిక్‌ విజయం దిశగా సాగింది. కానీ కీలక సమయంలో తలైవాస్‌ను ఆలౌట్‌ చేసిన దేవాంక్‌..  పట్నా పైరేట్స్‌ను గెలుపు పట్టాలెక్కించాడు. పట్నా పైరేట్స్‌ తరఫున ఆల్‌రౌండర్‌ అనికెత్‌ (4 పాయింట్లు), గుర్దీప్‌ (2 పాయింట్లు), సందీప్‌ (2 పాయింట్లు) మెరిశారు. తమిళ్‌ తలైవాస్‌ రెయిడర్‌ నరేందర్‌ ఖండోలా (15 పాయింట్లు), సచిన్‌ (6 పాయింట్లు) సహా డిఫెండర్‌ నితేశ్‌ (4 పాయింట్లు) మెరిసినా.. ఆ జట్టుకు సీజన్లో తొలి పరాజయం తప్పలేదు.

తలైవాస్‌ జోరు 
తమిళ్‌ తలైవాస్‌ వరుసగా మూడో మ్యాచ్‌లో జోరు చూపించింది. తలైవాస్‌, పట్నా పైరేట్స్‌ తొలి రెయిడ్‌లోనే పాయింట్ల ఖాతా తెరిచినా.. ఆ తర్వాత తలైవాస్ జొరందుకుంది. తలైవాస్ రెయిడర్లకు డిఫెండర్లు సైతం జత కలవటంతో పట్నా పైరేట్స్‌కు చిక్కులు తప్పలేదు. తొలి 20 నిమిషాల ఆట అనంతరం తమిళ్‌ తలైవాస్‌ 5 పాయింట్ల ఆధిక్యం సాధించింది. నరేందర్‌ సూపర్‌ టెన్‌తో కూతలో చెలరేగగా.. డిఫెండర్‌ నితేశ్‌ నాలుగు ట్యాకిల్స్‌తో మెరిశాడు. దీంతో తలైవాస్‌ 23-18లో పట్నా పైరేట్స్‌పై పైచేయి సాధించింది. పైరేట్స్‌ తరఫున దేవాంక్‌ 11 రెయిడ్‌ పాయింట్లతో మెరిసినా.. డిఫెన్స్‌లో పైరేట్స్ తేలిపోయింది. కూతలో తలైవాస్‌ కంటే మెరుగ్గా రాణించినా.. ట్యాకిల్స్‌లో వెనుకంజ వేయటంతో ఆధిక్యం కోల్పోవాల్సి వచ్చింది.

పుంజుకున్న పైరేట్స్‌ 
ద్వితీయార్థంలోనూ తమిళ్ తలైవాస్‌ ఆధిక్యం కొనసాగించింది. కానీ ఆట మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా మ్యాచ్‌ మలుపు తిరిగింది. కండ్లుచెదిరే కూతతో ఒంటరి పోరాటం చేసిన పైరేట్స్‌ రెయిడర్‌ దేవాంక్‌ 34వ నిమిషంలో సూపర్‌ రెయిడ్‌తో చెలరేగాడు. తలైవాస్‌ మ్యాట్‌పై నలుగురు ఆటగాళ్లను అవుట్ చేయటంతో పాటు ఆ జట్టును ఆలౌట్‌ చేశాడు. దీంతో నాలుగు పాయింట్ల వెనుకంజ నుంచి పైరేట్స్‌ ఏకంగా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరు ఐదు నిమిషాల్లో ఆధిక్యం నిలుపుకున్న పైరేట్స్‌ సీజన్లో తొలి విజయం సాధించింది. మ్యాచ్‌లో మెజార్టీ భాగం ఆధిక్యంలో నిలిచిన తలైవాస్ ఒక్క ఆలౌట్‌తో కుదేలైంది. ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో మూడు మ్యాచుల్లో తలైవాస్‌కు ఇది తొలి పరాజయం.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)