Breaking News

రూ. 12 కోట్లు ఇస్తున్నారు

Published on Tue, 03/11/2025 - 04:12

న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ) వార్షిక అవార్డుల విజేతలకు ఈసారి భారీగా ప్రైజ్‌మనీ దక్కనుంది. 2024 సీజన్‌కు సంబంధించి అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా 8 కేటగిరీల్లో 32 మంది నామినేట్‌ అయ్యారు. వీరందరికి కలిపి ఏకంగా రూ. 12 కోట్ల ప్రైజ్‌మనీ అందజేయనున్నట్లు హెచ్‌ఐ తెలిపింది. శనివారం న్యూఢిల్లీలో అవార్డుల వేడుక నిర్వహించనున్నారు.  
» మహిళలు, పురుషుల కేటగిరీలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా నిలిచిన వారికి బల్బీర్‌సింగ్‌ సీనియర్‌ అవార్డు... వర్ధమాన ప్లేయర్లకు పురుషుల విభాగంలో జుగ్‌రాజ్‌ సింగ్‌ పేరిట... మహిళల్లో అసుంత లాక్రా పేరిట ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డులను అందజేస్తారు.  
» ‘గోల్‌కీపర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా నిలిచిన వారికి బల్జీత్‌ సింగ్‌ అవార్డును... ‘డిఫెండర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’కు పర్గత్‌ సింగ్‌ అవార్డు, ‘మిడ్‌ ఫీల్డర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’కు అజిత్‌పాల్‌ సింగ్‌ అవార్డును... ‘ఫార్వర్డ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’కు ధన్‌రాజ్‌ పిళ్లై అవార్డును బహూకరిస్తారు.  
» భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచకప్‌ (1975) టైటిల్‌ గెలిచి 50 ఏళ్లు పూర్తికావడం, అలాగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) గుర్తింపు పొంది 100 ఏళ్లు (1925) పూర్తికావడంతో స్వర్ణోత్సవ వేడుకలు ఈ అవార్డుల కార్యక్రమంలోనే జరుగనుంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన పురుషుల జట్టును, ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ నెగ్గిన పురుషులు, మహిళల జట్లను ఘనంగా సన్మానించనున్నారు. సీనియర్‌ జట్లతో పాటు జూనియర్‌ ఆసియాకప్‌ సాధించిన పురుషులు, మహిళల జట్లను సత్కరిస్తారు.  
» బల్బీర్‌సింగ్‌ సీనియర్‌ అవార్డు రేసులో రిటైరైన పీఆర్‌ శ్రీజేశ్, కృష్ణన్‌ బహదూర్‌ పాఠక్‌లతో పాటు మహిళా ప్లేయర్లు సవిత, బిచూ దేవి ఖరిబం కూడా ఉన్నారు.  
» డిఫెండర్‌ అవార్డు కోసం సంజయ్, అమిత్‌ రోహిదాస్, హర్మన్‌ప్రీత్‌ సింగ్, ఉదిత పోటీపడుతున్నారు.  
» మిడ్‌ఫీల్డర్‌ అవార్డు కోసం జర్మన్‌ప్రీత్‌ సింగ్, హార్దిక్‌ సింగ్, నీలకంఠ శర్మ, సుమిత్‌ నామినేట్‌ అయ్యారు.  
» ఫార్వర్డ్‌ అవార్డు కోసం లాల్‌రెమ్సియామి, అభిషేక్, సుఖ్‌జీత్, నవ్‌నీత్‌ కౌర్‌ బరిలో ఉన్నారు.  æ అండర్‌–21 మహిళలకు ఇచ్చే వర్థమాన ప్లేయర్‌ అవార్డు రేసులో బ్యూటీ డుంగ్‌డుంగ్, దీపిక, వైష్ణవి ఫాల్కే, సునెలితా టొప్పొ ఉన్నారు.  
»అండర్‌–21 పురుషులకు ప్రదానం చేసే వర్ధమాన ప్లేయర్‌ పురస్కారం కోసం అర్‌‡్షదీప్‌ సింగ్, అమిర్‌ అలీ, శర్దానంద్‌ తివారి, అరిజీత్‌ సింగ్‌ బరిలో ఉన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)