Breaking News

DC Vs GT: ఇదేమి అంపైరింగ్‌.. పృథ్వీ షాది ఔటా? నాటౌటా? వీడియో వైరల్‌

Published on Thu, 04/25/2024 - 18:51

ఐపీఎల్‌-2024లో మ‌రోసారి థ‌ర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణ‌యం వివాదాస్ప‌ద‌మైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఢిల్లీ వేదిక‌గా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ పృథ్వీ షా వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. ప్ర‌స్తుతం పృథ్వీ షా ఔట్ క్రీడా వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అస‌లేం జ‌రిగిందంటే?
ఢిల్లీ ఇన్నింగ్స్ నాలుగో ఓవ‌ర్ వేసిన సందీప్ వారియర్ ఐదో బంతిని పృథ్వీ షాకు షార్ట్ పిచ్‌ డెలివరీని సంధించాడు. ఆ బంతిని  పృథ్వీ షా పుల్ షాట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ షాట్ స‌రిగ్గా క‌న‌క్ట్ కాక‌పోవ‌డంతో బంతి  డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దిశ‌గా బంతి గాల్లోకి లేచింది. ఈ క్ర‌మంలో  డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ నుంచి నూర్ అహ్మద్ ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చి  డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.

దీంతో గుజ‌రాత్ ఆట‌గాళ్లంతా సంబ‌రాల్లో మునిగి తేలిపోయారు. కానీ ఫీల్డ్ అంపైర్‌లు క్లీన్ క్యాచ్ అవునా కాదా అనే సందేహంతో థ‌ర్డ్ అంపైర్‌కు రిఫ‌ర్ చేశారు. థ‌ర్డ్ అంపైర్‌ ప‌లు కోణాల్లో ప‌రిశీలించి బంతి కింద చేతి వేళ్లు ఉన్న‌యాని త‌న నిర్ణ‌యాన్ని ఔట్‌గా ప్ర‌క‌టించాడు. అయితే రిప్లేలో బంతి గ్రౌండ్‌కు ట‌చ్ అయిన‌ట్లు క‌న్పించిన‌ప్ప‌టికి అంపైర్ మాత్రం క్లీన్ క్యాచ్‌గా ప్ర‌క‌టించ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు.

కామెంటెట‌ర్‌లు ఆకాష్ చోప్రా, పార్థివ్ పటేల్ సైతం క్యాచ్‌ను అందుకునే స‌మ‌యంలో బంతి నేలను తాకిందని అభిప్రాయపడ్డారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన నెటిజ‌న్లు చెత్త అంపైరింగ్‌.. అది క్లియ‌ర్‌గా నాటౌట్ అని కామెంట్లు చేస్తున్నారు. 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)