Breaking News

'రూ.75 లక్షలకు కూడా ఎవ‌రూ తీసుకులేదు.. ఇప్పటికైనా సిగ్గు పడు'

Published on Tue, 11/26/2024 - 16:51

ఐపీఎల్‌-2025 మెగా వేలంలో టీమిండియా ఆటగాడు పృథ్వీ షాకు తీవ్ర నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే.  రూ.75 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి అడుగుపెట్టిన పృథ్వీ షాను  కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. 2018లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ త‌ర‌పున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ ముంబై ఓపెన‌ర్‌.. అప్ప‌టి నుంచి ఆ ఫ్రాంచైజీకే ప్రాతినిథ్యం వ‌హిస్తూ వ‌స్తున్నాడు. 

కానీ ఐపీఎల్‌-2025 సీజ‌న్ మెగా వేలానికి ముందు షాను ఢిల్లీ రిటైన్ చేసుకోలేదు.  దీంతో వేలంలోకి వ‌చ్చిన అత‌డిని క‌నీసం వేరే ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుంద‌ని భావించారు. కానీ ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు.

అందుకు కార‌ణాలు లేక‌పోలేవు. పృథ్వీ షా ప్రస్తుతం పేలవ ఫామ్‌, ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. అంతేకాకుండా అతడిలో క్రమశిక్షణ కూడా లోపించింది. ఈ కారణాల చేతనే షాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదని జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో పృథ్వీ షాపై ఢిల్లీ క్యాపిట‌ల్స్ మాజీ అసిస్టెంట్ కోచ్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కనీస ధరకు కూడా వేలంలో అమ్ముడుపోనుందన పృథ్వీ సిగ్గుపడాలంటూ కైఫ్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డాడు.

పృథ్వీ సిగ్గు పడాలి: కైఫ్‌
"ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ  పృథ్వీ షాకు చాలా సపోర్ట్ చేసింది. అతడు పవర్ ప్లేలో అద్బుతంగా ఆడుతాడని, ఒకే ఓవర్‌లో 6 బౌండరీలు కొట్టగలిగే సత్తా ఉందని ఢిల్లీ నమ్మింది. కొన్ని సీజన్లలో ఢిల్లీ నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు.

ఢిల్లీ ఫ్రాంచైజీ ఆశించినట్టే ఒకే ఓవర్‌లో 6 ఫోర్లు కొట్టి చూపించాడు. అతడికి చాలా అతడు బాగా ఆడితేనే మేము గెలుస్తామని భావించేవాళ్లం​. కాబట్టి అతడికి ప్రతీ మ్యాచ్‌లోనూ అవకాశం ఇచ్చాము. కొన్ని సార్లు వరుసగా విఫలమైనా కూడా మేము సపోర్ట్ చేస్తూనే వచ్చాం. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి అతడికి జట్టులో అవకాశమివ్వకూడదని చాలా సందర్భాల్లో నిర్ణయించుకున్నాం.

కానీ ఆ తర్వాత మ్యాచ్ రోజున మా మా నిర్ణయాన్ని మార్చుకుని అతడికి ఛాన్స్ ఇచ్చేవాళ్లం. ఎందుకంటే అతడు పెద్ద ఇన్నింగ్స్ ఆడితే గెలుస్తామన్న నమ్మకం మాకు ఉండేది. కానీ అతడు మాత్రం తనకు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాడు.

దీంతో అతడిని ఢిల్లీ కూడా విడిచిపెట్టింది. కనీస ధర 75 లక్షలతో వేలంలోకి వచ్చిన అతడు అమ్ముడుపోకపోవడం నిజంగా సిగ్గుచేటు. పృథ్వీ షా  తిరిగి వెనక్కి వెళ్లి బేసిక్స్ నేర్చుకోవాలి అంటూ జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ పేర్కొన్నాడు.
చదవండి: వెంకటేశ్‌ అయ్యర్‌, నరైన్‌ కాదు.. కేకేఆర్‌ కెప్టెన్‌గా అతడే!?
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)