Breaking News

పృథ్వీ షా విధ్వంసకర ఫిప్టీ.. భారీ ఆధిక్యం దిశగా ముంబై

Published on Fri, 10/04/2024 - 17:22

ఇరానీ కప్‌-2024లో భాగంగా లక్నో వేదికగా ముంబై, రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ముంబై ఓపెనర్‌ పృథ్వీ షా క్విక్‌ ఫైర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. టీ20ల్లో స్టైల్లో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 37 బంతుల్లోనే 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

ఓవరాల్‌గా 105 బంతులు ఎదుర్కొన్న 76 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో పృథ్వీ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక నాలుగో రోజు ఆటముగిసే సమయానికి సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ముంబై 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ముంబై ప్రస్తుతం 274 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 

క్రీజులో సర్ఫరాజ్‌ ఖాన్‌(9), తనీష్‌ కొటియన్‌(20) పరుగులతో ఉన్నారు. అంతకుముందు రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా బ్యాటర్లలో అభిమన్యు ఈశ్వరన్‌(191) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 

తృటిలో డబుల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అదే విధంగా ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.. ముంబై స్టార్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌(222 నాటౌట్‌) డబుల్‌ సెంచరీతో మెరిశాడు. అయితే ఇంకా కేవలం ఒక్క రోజు ఆట మాత్రమే మిగిలి ఉండడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసే అవకాశం కన్పిస్తోంది.
చదవండి: ధోని కోసమే ఆ రూల్స్‌ను మార్చారు: మహ్మద్‌ కైఫ్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)