Breaking News

టీమిండియా ఓపెనర్‌ అరుదైన రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి

Published on Sat, 02/10/2024 - 13:26

టీమిండియా ఓపెనర్‌, ముంబై బ్యాటర్‌ పృథ్వీ షా రంజీ ట్రోఫీ పునరాగమానాన్ని ఘనంగా చాటుకున్నాడు. రాయ్‌పూర్‌ వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో పృథ్వీ షా చెలరేగాడు. 107 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 185 బంతులు ఎదుర్కొన్న పృథ్వీ షా.. 18 ఫోర్లు, 3 సిక్స్‌లతో 159 పరుగులు చేశాడు.

ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన పృథ్వీ షా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో తొలి రోజు లంచ్‌కు ముందే కెరీర్‌లో రెండు సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో అసోంపై 379 బంతుల్లో  383 పరుగులు చేసిన పృథ్వీ.. రంజీ ట్రోఫీలోనే రెండో అత్యధిక స్కోరు సాధించాడు.

అప్పుడు కూడా మొదటి రోజు లంచ్‌కు ముందే సెంచరీని నమోదు చేశాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 351 పరుగులకు ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో  భూపేన్‌ లల్వాణీ (102) పరుగులతో రాణించాడు. ఛత్తీస్‌గఢ్‌ బౌలర్లలో ఆశిష్ చౌహాన్ 6 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు రవి కిరణ్‌ మూడు, మాలిక్‌ ఒక్క వికెట్‌ సాధించాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)