Breaking News

'ఏమి త‌ప్పుచేశానో అర్ధం కావడం లేదు.. చాలా బాధగా ఉంది'

Published on Wed, 11/27/2024 - 19:07

టీమిండియా తరుపున అరంగేట్రంలోనే సెంచ‌రీ చేసిన‌ ఆటగాళ్లలో పృథ్వీ షా ఒకరు. తొలుత‌ అత‌డి ఆట తీరును చూసి భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌తో పోల్చారు. కానీ ఆ త‌ర్వాత‌ క్రమశిక్షణారాహిత్యం, ఫిట్‌నెస్‌ ఫామ్ లేమి కారణంగా భార‌త జ‌ట్టులో చోటు కోల్పోయాడు. 

క్ర‌మంగా త‌న ఫిట్‌నెస్‌ను కూడా కోల్పోయిన పృథ్వీ షా ముంబై రంజీ జ‌ట్టుకు కూడా దూర‌మ‌య్యాడు. ఇప్పుడు ఐపీఎల్ ఆడే అవ‌కాశం కూడా ఈ ముంబై ప్లేయ‌ర్ కోల్పోయాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలోనూ పృథ్వీ షాను ఒక్క ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.

2018 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అరంగేట్రం చేసిన షా.. అప్పటి నుంచి గత సీజన్‌ వరకు ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ రిటైన్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే రూ. 75 ల‌క్ష‌ల క‌నీస ధ‌ర‌తో వేలంలోకి వ‌చ్చిన అత‌డిని ఏ ఫ్రాంచైజీ సొంతం చేసుకునేందుకు ఆస‌క్తి చూప‌లేదు.

దీంతో పృథ్వీ షాను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రోల్స్‌పై పృథ్వీ షా మాట్లాడిన ఓ పాత వీడియో ఒకటి సోషల్ మీడియా ఒకటి వైరలవుతోంది. తన కెరీర్ ఆసాంతం ట్రోలింగ్  ఎదుర్కొన్నట్లు షా చెప్పుకొచ్చాడు.

ఎవరైనా ఒక వ్యక్తి నన్ను ఫాలో కాకపోతే.. నన్ను మీరేలా ఎలా ట్రోల్ చేస్తారు? అంటే అతడి కళ్లన్నీ నా మీదే ఉన్నాయని ఆర్దం. ట్రోలింగ్ చేయడం మంచిది కాదు, కానీ అది అంత చెడ్డ విషయం కూడా కాదు. అయితే దేనికైనా ఓ హద్దు ఉంటుంది. 

ఆ హద్దు దాటి వారిని టార్గెట్ చేయడం మంచిది కాదు. క్రికెటర్లతో పాటు ఇతర వ్యక్తులను ట్రోల్ చేయడం నేను చాలా సందర్బాల్లో చూశాను. నాపై చేస్తున్న ట్రోలింగ్‌లు, మీమ్‌లు అన్నీ చూస్తున్నాను. అటువంటి చూసి నేను బాధపడిన సందర్భాలు ఉన్నాయి.

నేను బయట కన్పిస్తే చాలు ప్రాక్టీస్ చేయకుండా తిరుగుకుంటున్నాడని కామెం‍ట్లు చేస్తున్నారు. నా పుట్టిన రోజున కూడా నేను బయటకు వెళ్లకూడదా? నేను ఏమి త‌ప్పుచేశానో కూడా నాకే అర్ధం కావ‌డం లేదు. కానీ మ‌నం ఏమి చేసినా త‌ప్పుబ‌ట్టేవాళ్లు ఉంటార‌ని మాత్రం ఆర్ధం చేసుకున్నా అని ఆ వీడియోలో పృథ్వీ షా పేర్కొన్నాడు.
చదవండి: ICC Rankings: సత్తాచాటిన జైశ్వాల్‌.. నెం1 ర్యాంక్‌కు ఒక్క అడుగు దూరంలో
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)