Breaking News

ఓవ‌ర్ వెయిట్‌..! టీమిండియా ఓపెన‌ర్‌కు ఊహించ‌ని షాక్‌?

Published on Tue, 10/22/2024 - 10:46

టీమిండియా ఓపెన‌ర్ పృథ్వీ షాకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ఊహించ‌ని షాకిచ్చింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ రంజీ ట్రోఫీ 2024-25 సీజ‌న్‌లో ముంబై జ‌ట్టు నుంచి పృథ్వీ షాను అర్ధంతరంగా ఎంసీఏ త‌ప్పించింది.

రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూపులో ఉన్న ముంబై జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో త్రిపురతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఎంపిక చేసిన జట్టులో షాకు చోటు దక్కలేదు. ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల కార‌ణంగా అత‌డిపై వేటు వేసినట్లు ఎంసీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. 

"పృథ్వీ షాకు సెలక్టర్లు బ్రేక్ ఇచ్చారు. త్రిపురతో మ్యాచ్‌కు అతడు దూరంగా ఉండనున్నాడు. కోచ్‌, సెలక్టర్లు అతడితో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నారు. పృథ్వీ తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాల్సి ఉందని"ఎంసీఎ వెల్లడించింది. క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. సంజ‌య్ పాటిల్ నేతృత్వంలో ముంబై సెలక్షన్ కమిటీ పృథ్వీ షా ఫిట్‌నెస్‌పై ఆసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 

అంతేకాకుండా పృథ్వీ ఓవర్ వెయిట్‌(ఆధిక బరువు) ఉన్నట్లు సెలక్టర్లు గుర్తించారు. నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌ను కూడా పృథ్వీ షా నిర్లక్ష్యం చేస్తున్నాడని టీమ్ మేనేజ్‌మెంట్‌ సెలక్టర్లకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే అతడిపై వేటు వేసినట్లు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. కాగా పృథ్వీ షా గత కొన్నాళ్లుగా తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో కేవలం 59 పరుగులే మాత్రమే షా చేశాడు.
చదవండి: IND vs NZ: టీమిండియాతో రెండో టెస్టు.. న్యూజిలాండ్‌కు భారీ షాక్‌

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)