Breaking News

'23 ఏళ్ల‌కే రూ. 40 కోట్లు సంపాద‌న‌.. అదే అత‌డి కెరీర్‌ను దెబ్బ‌తీసింది'

Published on Sat, 11/30/2024 - 12:28

ఐపీఎల్‌-2025 మెగా వేలంలో టీమిండియా ఓపెనర్ పృథ్వీ షాకు ఊహించని షాక్ తగిలిన సంగతి తెలిసిందే. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. ప్రస్తుతం ఫామ్ లేమి, ఫిట్‌నెస్ సమస్యలతో సతమతవుతున్నందున షాను ఏ ఫ్రాంచైజీ కూడా సొంతం చేసేకునేందుకు ఆసక్తి చూపలేదు.

వీటికి తోడు ఈ ముంబై ఆటగాడిలో ‍క్రమశిక్షణ కూడా లోపించింది. ఈ క్రమంలోనే 25 ఏళ్ల పృథ్వీషా అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. 2018 సీజన్‌లో ఢిల్లీ ​క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన షా.. తొలిసారి ఈ క్యాష్‌రిచ్ లీగ్‌కు దూరంగా ఉండనున్నాడు.

రంజీ జట్టులో కూడా అతడి చోటు ప్రశ్నార్ధకంగానే ఉంది. ఈ నేపథ్యంలో పృథ్వీ షాను ఉద్దేశించి ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ హెడ్ కోచ్ ప్రవీణ్‌ అమ్రే కీలక వ్యాఖ్యలు చేశాడు.  చిన్నవయసులో వచ్చిన కీర్తి ప్రతిష్ఠలను హ్యాండిల్‌ చేయలేకపోయుండొచ్చని అమ్రే అభిప్రాయపడ్డాడు.

"పృథ్వీ షా లాంటి టాలెంట్ ఉన్న ఆటగాడు చేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంటుండటం బాధ కలిగిస్తోంది. ఇప్పటికీ అతడికి ఐపీఎల్‌లో 30 బంతుల్లో ఫిఫ్టీ కొట్టే సత్తా ఉంది. బహుశా చిన్న వయస్సులోనే తనకు వచ్చిన కీర్తీ, డబ్బును సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయుండొచ్చు.

భారత క్రికెట్‌లో అతడి జీవితం ఒక కేస్ స్టడీగా ఉపయోగపడవచ్చు. ప్రతిభ ఒక్కటే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లదు. క్రమశిక్షణ, సంకల్పం, అంకితభావం ఉంటేనే జీవితంలో ముందుకు వెళ్లగలము. అతడికి జరిగింది ఇంకెవరికీ జరగకూడదు. మూడేళ్ల క్రితమే పృథ్వీకి వినోద్ కాంబ్లీ కోసం ఉదాహరణగా చెప్పాను.  కాంబ్లీ పతనాన్ని నేను దగ్గరి నుంచి చూశాను. 

ఈ తరం కుర్రాళ్లకు కొన్ని విషయాలు నేర్పించడం సులువు కాదు. అతడు 23 ఏళ్ల వయస్సులోనే సుమారుగా రూ. 30-40 కోట్లు సంపాదించి ఉండవచ్చు. ఐఐఎమ్‌ గ్రాడ్యుయేట్‌ కూడా అంత సంపాదించరేమో!.

అందుకు అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ధన్యవాదాలు తెలపాలి. అయితే చిన్నవయస్సులో అంత మొత్తం సంపాందించినప్పుడు, కచ్చితంగా దృష్టి మళ్లే అవకాశముంటుంది. అతడు ఈ ఐపీఎల్ వేలాన్ని సానుకూలంగా తీసుకుంటాడని ఆశిస్తున్నాను.

ఇది అతడికి ఒక కనువిప్పు లాంటిది. షాకు ఇంకా చాలా వయస్సు ఉంది. అతడికి ప్రస్తుతం కేవలం 25 ఏళ్ల మాత్రమే అని ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షా పేర్కొన్నాడు.
చదవండి: ఇషాన్ కిష‌న్ ఊచ‌కోత‌.. 5 ఫోర్లు, 9 సిక్స్‌ల‌తో తుపాన్‌ ఇన్నింగ్స్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)