Breaking News

Prithvi Shaw: ఖరీదైన కారు కొన్న పృథ్వీ షా.. ధర ఎంతంటే!

Published on Mon, 10/18/2021 - 12:08

Prithvi Shaw Gifts Himself BMW Car: టీమిండియా క్రికెటర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షా ఖరీదైన కారు కొన్నాడు. దాదాపు 68.50 లక్షల విలువ గల(ఎక్స్‌ ఫోరూం ధర) బీఎండబ్ల్యూ 6 సిరీస్‌ గ్రాన్‌ టరిస్మోను సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్న 21 ఏళ్ల పృథ్వీ షా... కారు ముందు దిగిన ఫొటోను షేర్‌ చేశాడు. ‘‘అట్టడుగు స్థాయి నుంచి మొదలై.. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం’’ అంటూ ఉద్వేగభరిత కామెంట్‌ జత చేశాడు. 

కాగా మహారాష్ట్రలోని థానేలో సాధారణ కుటుంబంలో జన్మించిన పృథ్వీ షా... దేశవాళీ క్రికెట్‌లో పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీ టోర్నమెంట్‌లో ఈ ముంబై ఓపెనర్‌ డబుల్‌ సెంచరీ సాధించాడు. 152 బంతుల్లో 227 పరుగులు చేసి సంజూ శాంసన్‌ (212) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అధిగమించాడు.

అంతేగాక లిస్టు ఏ క్రికెట్ ‌(పురుషులు)లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌(శ్రేయస్‌ అయ్యర్‌ గైర్హాజరీ)గా కూడా నిలిచాడు. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా 15 మ్యాచ్‌లలో 479 పరుగులు చేసి సత్తా చాటాడు. యూఏఈ నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఈ యువ ప్లేయర్‌ తనకు తాను బీఎండబ్ల్యూ కారును గిఫ్టుగా ఇచ్చుకున్నాడు.

బీఎండబ్ల్యూ 6 సిరీస్‌ జీటీ స్పెసిఫికేషన్స్‌
పెట్రోల్‌, డీజిల్‌ వర్షన్‌లో లభ్యం
ఇంజిన్‌: 1995- 2993సీసీ
టాప్‌ స్పీడ్‌: 220- 250 కేఎమ్‌పీహెచ్‌

చదవండి: Yuvraj Singh Arrested: క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ అరెస్ట్‌..!

Videos

ఎల్లోమీడియాను ఉతికి ఆరేసిన వైఎస్ జగన్

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

Photos

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)