Breaking News

పృథ్వీ షాపై వేటు

Published on Wed, 10/23/2024 - 03:50

ముంబై: భారత జట్టు మాజీ సభ్యుడు, టాపార్డర్‌ బ్యాటర్‌ పృథ్వీ షాను ముంబై రంజీ జట్టు నుంచి తప్పించారు. ఫామ్‌లో లేకపోవడం, ఫిట్‌నెస్‌ సమస్యలు, అనుచిత ప్రవర్తన కారణంగా అతనిపై వేటు పడింది. టీమిండియా ఓపెనర్‌గా అంతర్జాతీయ కెరీర్‌లో ఐదు టెస్టులు, ఆరు వన్డేలు, ఒక టి20 మ్యాచ్‌ ఆడిన 24 ఏళ్ల పృథ్వీ ఇటీవలి కాలంలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం కూడా ముంబై సెలక్టర్ల ఆగ్రహానికి కారణమైంది. 

తరచూ జట్టు ట్రెయినింగ్‌ సెషన్‌లకు డుమ్మా కొట్టడంతో పాటు బరువు పెరిగి మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ను కోల్పోవడంతో అతనికి ఉద్వాసన పలికారు. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన పృథ్వీ షా నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 7, 12, 1, 39 నాటౌట్‌ స్కోర్లు చేశాడు. ఫిట్‌నెస్‌ సమస్యలతో ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా స్పందించడం లేదు. దీంతో అతన్ని తప్పించి 29 ఏళ్ల ఎడంచేతి ఓపెనింగ్‌ బ్యాటర్‌ అఖిల్‌ హేర్వడ్కర్‌ను ముంబై జట్టులోకి తీసుకున్నారు. 

అతను 41 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 36.51 సగటు నమోదు చేశాడు. ఏడు సెంచరీలు, పది అర్ధసెంచరీలు బాదాడు. ముంబై తదుపరి మ్యాచ్‌ను త్రిపురతో ఆడనుంది. అగర్తలాలో ఈ నెల 26 నుంచి 29 వరకు ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత టి20 కెపె్టన్, మిడిలార్డర్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చారు. 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు