Breaking News

భార‌త జ‌ట్టులోకి యార్క‌ర్ల కింగ్‌.. ఎవ‌రంటే?

Published on Sun, 07/12/2026 - 16:02

ఇంగ్లండ్ వ‌న్డేల‌తో పాటు జింబాబ్వే టూర్‌కు ఎంపిక చేసిన భార‌త జ‌ట్టులో స్వ‌ల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ హ‌ర్షిత్ రాణా తొడ కండరాల గాయం కార‌ణంగా ఇంగ్లండ్‌తో వ‌న్డేల‌కు దూర‌మ‌య్యాడు. అత‌డి స్ధానంలో ఢిల్లీ పేస‌ర్ ప్రిన్స్ యాద‌వ్‌ను జ‌ట్టులోకి తీసుకున్నారు. ఈ విష‌యాన్ని బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించింది. 

గ‌త నెల‌లో అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో ప్రిన్స్ అరంగేట్రం చేశాడు. త‌న డెబ్యూ సిరీస్‌లో ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికి, హ‌ర్షిత్ రాణా తిరిగి రావ‌డంతో వ‌న్డే జట్టులో చోటు కోల్పోయాడు. అయితే మ‌ళ్లీ ఇప్ప‌డు హ‌ర్షిత్ గాయం బారిన ప‌డ‌డంతో ప్రిన్స్ మ‌రోసారి వ‌న్డేల్లో ఆడే అవ‌కాశం ల‌భించింది. ప్రిన్స్‌ కొత్త బంతితో పాటు డెత్ ఓవ‌ర్ల‌లో అద్భుత బౌలింగ్ చేయ‌గ‌ల‌డు. పిన్ పాయింట్ యార్క‌ర్ల వేయ‌డంలో దిట్ట‌. అందు​కే అతడిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకున్నారు.

ఇక మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి కూడా తొడ కండ‌రాల గాయం కార‌ణంగా జింబాబ్వేల‌తో టీ20కు దూర‌మ‌య్యాడు. అత‌డి స్ధానాన్ని లెగ్ స్పిన్న‌ర్ రవి బిష్ణోయ్‌తో భ‌ర్తీ చేశారు.  ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో విఫ‌ల‌మైన‌ప్ప‌టికి బిష్ణోయ్‌కు సెల‌క్ట‌ర్లు మ‌రో అవ‌కాశ‌మిచ్చారు. మంగ‌ళ‌వారం నుంచి భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్ ప్రారంభం కానుంది.

ఇంగ్లండ్ వన్డేలకు  భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ సింగ్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్,జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్

జింబాబ్వే టీ20లకు భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ , శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్జ్, రింకు సింగ్, హర్ష్ దూబే, యాక్ షర్మా థావ్, ప్రిన్స్ షర్మా థావ్, ప్రిన్స్ యాదవ్, మే ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీప‌ర్‌), రవి బిష్ణోయ్

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి