Breaking News

సింధు శుభారంభం

Published on Wed, 08/27/2025 - 06:19

పారిస్‌: మరో పతకం లక్ష్యంగా ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో అడుగు పెట్టిన భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, ప్రణయ్‌ తొలి రౌండ్‌ అడ్డంకిని దాటారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మాజీ చాంపియన్‌ సింధు 23–21, 21–6తో ప్రపంచ 69వ ర్యాంకర్‌ కలోయానా నల్బంతోవా (బల్గేరియా)పై విజయం సాధించింది. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్‌ సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీ ఎదురైంది. 

సింధు రెండుసార్లు గేమ్‌ పాయింట్లను కాచుకోవడం గమనార్హం. తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న సింధు రెండో గేమ్‌లో మాత్రం దూకుడుగా ఆడింది. స్కోరు 6–5 వద్ద సింధు చెలరేగి వరుసగా 14 పాయింట్లు స్కోరు చేయడం విశేషం. నేడు జరిగే రెండో రౌండ్‌లో ప్రపంచ 40వ ర్యాంకర్‌ కరుపథెవన్‌ లెట్షానా (మలేసియా)తో సింధు ఆడుతుంది. 

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత ప్రణయ్‌ 21–18, 21–15తో ప్రపంచ 47వ ర్యాంకర్‌ జోకిమ్‌ ఒల్డార్ఫ్‌ (ఫిన్‌లాండ్‌)పై గెలుపొందాడు. 47 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్‌కు ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనా కీలకదశలో పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. నేడు జరిగే రెండో రౌండ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఆండెర్స్‌ ఆంటోన్‌సెన్‌ (డెన్మార్క్‌)తో ప్రణయ్‌ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఇద్దరు 2–2తో సమంగా ఉన్నారు.  

రుత్విక–రోహన్‌ జోడీ బోణీ 
మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌ (భారత్‌) ద్వయం 18–21, 21–16, 21–18తో లియోంగ్‌ లోక్‌ చోంగ్‌–ఎన్జీ వెంగ్‌ చి (మకావ్‌) జంటపై గెలుపొందింది. నేడు జరిగే రెండో రౌండ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంక్‌ జోడీ చెన్‌ టాంగ్‌ జి–తో ఈ వె (మలేసియా)తో రుత్విక–రోహన్‌ ద్వయం పోటీపడుతుంది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో హరిహరన్‌–రూబన్‌ కుమార్‌ (భారత్‌) జోడీ 15–21, 5–21తో లియు కువాంగ్‌ హెంగ్‌–యాంగ్‌ పో హాన్‌ (చైనీస్‌ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం నేడు జరిగే రెండో రౌండ్‌లో లియు కువాంగ్‌ హెంగ్‌–యాంగ్‌ పో హాన్‌లతో ఆడుతుంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)