Breaking News

కాంస్యంతో సరి 

Published on Sun, 08/27/2023 - 02:20

కోపెన్‌హాగెన్‌ (డెన్మార్క్‌): అసాధారణ ఆటగాడు అక్సెల్‌సన్‌కు సొంతగడ్డపైనే చుక్కలు చూపించిన భారత షట్లర్‌ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ పోరు సెమీ ఫైనల్లో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌íÙప్‌లో ఈ కేరళ స్టార్‌ కాంస్యంతోనే సరిపెట్టుకున్నాడు. క్వార్టర్స్‌లో తొలి గేమ్‌ కోల్పోయినప్పటికీ వరుస గేమ్‌లను గెలిచి పతకం ఖాయం చేసుకున్న భారత ఆటగాడు చిత్రంగా సెమీస్‌లో తొలి గేమ్‌ గెలిచి జోరు మీదుండి తర్వాత రెండు గేమ్‌లను గెలువలేక మ్యాచ్‌ ఓడిపోయా డు.

శనివారం 76 నిమిషాల పాటు సాగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో హెచ్‌.ఎస్‌. ప్రణయ్‌ 21–18, 13–21, 14–21తో కున్లావుత్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం చవిచూశాడు. తొలి గేమ్‌లో తెలివైన షాట్లతో ప్రత్యర్థిని కోర్టులో పరుగు పెట్టిస్తూ స్కోరు సాధించాడు. నెట్‌వద్ద చురుగ్గా పాయింట్లు సాధించిన ప్రణయ్‌ స్మాష్‌లతో చెలరేగి...  తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు.

తర్వాత రెండో గేమ్‌ కూడా ప్రణయ్‌ ఆధిపత్యంతోనే మొదలైంది. వరుసగా 4–0తో పైచేయి సాధించాడు.ఈ దశలో చేసిన అనవసర తప్పిదాలతో భారత షట్లర్‌ పాయింట్లను కోల్పోయాడు.  పదే పదే ఇవే తప్పిదాలు కొనసాగించడంతో ఆధిక్యాన్ని, ఆపై గేమ్‌నే కోల్పోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లోనూ ప్రణయ్‌ తప్పిదాలనే ఆసరాగా చేసుకొని పుంజుకున్న థాయ్‌ ప్రత్యర్థి చివరిదాకా ఆధిపత్యాన్ని కొనసాగించాడు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)