Breaking News

విజేత తేలేది ‘టైబ్రేక్స్‌’లోనే...

Published on Thu, 08/24/2023 - 03:01

బకూ (అజర్‌బైజాన్‌): ప్రపంచకప్‌ చెస్‌ టోర్నీ ఓపెన్‌ విభాగంలో చాంపియన్‌ ఎవరో టైబ్రేక్స్‌ ద్వారా తేలనుంది. భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద, వరల్డ్‌ నంబర్‌వన్‌ కార్ల్‌సన్‌ (నార్వే) మధ్య ఫైనల్లో రెండో గేమ్‌ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది.  వరుసగా రెండో ‘డ్రా’ తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. ఫలితంగా నేడు వీరిద్దరి మధ్య టైబ్రేక్‌ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు.

ముందుగా ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో 25 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లు ఆడిస్తారు. ఇందులో ఫలితం వస్తే ఫైనల్‌ను ముగిస్తారు. రెండు గేమ్‌ల తర్వాత కూడా సమంగా ఉంటే... ఈసారి 10 నిమిషాలు నిడివిగల రెండు గేమ్‌లు నిర్వహిస్తారు. ఇక్కడా ఫలితం తేలకపోతే 5 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లను ఆడిస్తారు.

అయినా ఫలితం తేలకపోతే 3 నిమిషాల నిడివిగల గేమ్‌లను ఇద్దరిలో ఒకరు గెలిచే వరకు ఆడించి విజేతను ఖరారు చేస్తారు. 32 ఏళ్ల కార్ల్‌సన్‌ గతంలో క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్‌ ఫార్మాట్‌లలో ప్రపంచ చాంపియన్‌గా నిలువగా... ప్రజ్ఞానంద కెరీర్‌లో తొలిసారి ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడుతున్నాడు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)