Breaking News

రన్నరప్‌ ప్రజ్ఞానంద

Published on Sat, 11/16/2024 - 03:45

కోల్‌కతా: టాటా స్టీల్‌ చెస్‌ ఇండియా ర్యాపిడ్‌ టోర్నమెంట్‌ ఓపెన్‌ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య 9 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ప్రజ్ఞానంద, సో వెస్లీ (అమెరికా) 5.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. 

అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... ప్రజ్ఞానందకు రెండో స్థానం, సో వెస్లీకి మూడో స్థానం లభించాయి. నార్వే దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌ 7.5 పాయింట్లతో ర్యాపిడ్‌ టోర్నీ చాంపియన్‌గా నిలిచాడు. 

భారత గ్రాండ్‌మాస్టర్లు నిహాల్‌ సరీన్‌ (4 పాయింట్లు) ఆరో ర్యాంక్‌లో, ఇరిగేశి అర్జున్‌ (3.5 పాయింట్లు) ఎనిమిదో ర్యాంక్‌లో, విదిత్‌ (3 పాయింట్లు) తొమ్మిదో ర్యాంక్‌లో, ఎస్‌ఎల్‌ నారాయణన్‌ (3 పాయింట్లు) చివరిదైన పదో ర్యాంక్‌లో నిలిచారు.
 
వంతికకు మూడో స్థానం 
ఇదే టోర్నీ మహిళల ర్యాపిడ్‌ విభాగంలో భారత యువ క్రీడాకారిణి వంతిక అగర్వాల్‌ 5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. 7.5 పాయింట్లతో అలెక్సాండ్రా గొర్యాక్‌చినా (రష్యా) చాంపియన్‌గా అవతరించింది. 

5.5 పాయింట్లతో నానా జాగ్‌నిద్జె (జార్జియా) రన్నరప్‌గా నిలిచింది. భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక (4.5 పాయింట్లు) ఐదో ర్యాంక్‌లో, దివ్య దేశ్‌ముఖ్‌ (3.5 పాయింట్లు) ఏడో ర్యాంక్‌లో, వైశాలి (3.5 పాయింట్లు) ఎనిమిదో ర్యాంక్‌లో, కోనేరు హంపి (3 పాయింట్లు) చివరిదైన పదో ర్యాంక్‌లో నిలిచారు.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)