Breaking News

శ్రీజేష్‌కు రూ.2 కోట్ల భారీ నజరానా.. ప్ర‌క‌టించిన కేర‌ళ స‌ర్కార్‌

Published on Wed, 08/21/2024 - 19:34

భార‌త  స్టార్  హాకీ గోల్ కీప‌ర్ పీఆర్ శ్రీజేష్ త‌న 18 ఏళ్ల సుదీర్ఘ‌ కెరీర్‌ను ఘ‌నంగా ముగించిన సంగతి తెలిసిందే. ప్యారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పత‌కం సాధించిన త‌ర్వాత శ్రీజేష్ అంత‌ర్జాతీయ హాకీకీ విడ్కోలు ప‌లికాడు.

ఈ నేప‌థ్యంలో శ్రీజేష్‌కు కేర‌ళ ప్ర‌భుత్వం భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. అత‌డికి రూ.2 కోట్ల న‌గ‌దు బ‌హుమ‌తి ఇవ్వునున్నట్లు కేరళ స‌ర్కార్ వెల్ల‌డించింది. బుధ‌వారం ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

‘భారత హాకీ జట్టులో సభ్యుడు, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన శ్రీజేశ్‌కు రెండు కోట్ల రూపాయలు బహుమతిగా అందిస్తున్నాం’ అని సీఎంఓ ప్రకటనలో పేర్కొంది. 

ప్యారిస్‌లో భార‌త హాకీ జట్టు కాంస్య ప‌త‌కం సాధించ‌డంలో శ్రీజేష్‌ది కీల‌క పాత్ర‌. ముఖ్యంగా బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీజేష్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కోట గోడలా నిలిచిన శ్రీజేష్‌ బ్రిటన్‌కు ఎక్స్‌ట్రా గోల్‌ చేసే ఛాన్స్‌ ఇవ్వలేదు. కాగా తన 18 ఏళ్ల కెరీర్‌లో శ్రీజేష్‌ భారత్‌ తరఫున 336 మ్యాచ్‌లు ఆడాడు.

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)