Breaking News

క్వార్టర్‌ ఫైనల్లో పోర్చుగల్‌

Published on Wed, 07/03/2024 - 04:00

ఫ్రాంక్‌ఫర్ట్‌ (జర్మనీ): యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో మాజీ చాంపియన్‌ పోర్చుగల్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే టాప్‌ టీమ్‌లలో ఒకటైన పోర్చుగల్‌కు విజయం అంత సులువుగా దక్కలేదు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 57వ స్థానంలో ఉన్న స్లొవేనియా గట్టి పోటీనిచ్చింది. ఒక దశలో స్లొవేనియా దూకుడు చూస్తే విజయం సాధించేలా అనిపించింది. కానీ చివరకు పెనాల్టీ షూటౌట్‌లో విజయం పోర్చుగల్‌ సొంతమైంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్‌ లేకుండా 0–0తో సమంగా నిలవగా...షూటౌట్‌లో పోర్చుగల్‌ 3–0తో గెలుపొందింది. 

దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు నిర్ణీత సమయంలో మ్యాచ్‌ గెలిపించే అవకాశం వచ్చినా అది సాధ్యం కాలేదు. ఈ మ్యాచ్‌లో అతను పలు అవకాశాలు వృథా చేశాడు. ఎట్టకేలకు 105వ నిమిషంలో పోర్చుగల్‌కు పెనాల్టీ కిక్‌ లభించింది. అయితే రొనాల్డో కొట్టిన ఈ కిక్‌ను స్లొవేనియా గోల్‌ కీపర్‌ జాన్‌ ఆబ్లక్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. దాంతో రొనాల్డో కన్నీళ్లపర్యంతం కావడంతో సహచరులు సముదాయించాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు షూటౌట్‌లో గెలిచి పోర్చుగల్‌ ఊపిరి పీల్చుకుంది. 

పోర్చుగల్‌ తరఫున రొనాల్డో, బ్రూనో ఫెర్నాండెజ్, బెర్నార్డో సిల్వ గోల్స్‌ సాధించగా... స్లొవేనియా ఆటగాళ్లు ఎల్‌లిసిక్, బల్కోవెక్, వెర్బిక్‌ కొట్టిన షాట్‌లను పోర్చుగల్‌ కీపర్‌ డియాగో కోస్టా నిలువరించగలిగాడు. క్వార్టర్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌తో పోర్చుగల్‌ తలపడుతుంది. 2016లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఫైనల్లో పోర్చుగల్‌ గెలిచి చాంపియన్‌గా నిలిచింది. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 3–0తో రొమేనియాను ఓడించి క్వార్టర్స్‌ చేరింది.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)