Asian Games 2023: సెమీస్‌లో బంగ్లాదేశ్‌ చిత్తు.. ఫైనల్‌కు చేరిన భారత్‌

Published on Sun, 09/24/2023 - 08:41

ఆసియాక్రీడల మహిళల క్రికెట్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌-1లో బంగ్లాదేశ్‌ను 8వికెట్ల తేడాతో భారత జట్టు చిత్తు చేసింది. దీంతో ఈ మెగా ఈవెంట్‌ ఫైనల్లో భారత్‌ అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌.. భారత బౌలర్ల దాటికి కేవలం 51 పరుగులకే కుప్పకూలింది.

భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్‌ 4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. సటిటాస్ సాధు, గైక్వాడ్‌, వైద్యా తలా వికెట్‌ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో నిగార్‌ సుల్తానా 12 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. 

అనంతరం 52 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 8.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో జెమిమా రోడ్రిగ్స్(20 నాటౌట్‌),షెఫాలీ వర్మ(17) పరుగులతో రాణించారు. ఇక సోమవారం(సెప్టెంబర్‌ 25) జరగనున్న ఫైనల్లో శ్రీలంక లేదా పాకిస్తాన్‌తో భారత్‌ తలపడనుంది.
చదవండి: Asian Games 2023: పతకాల ఖాతా తెరిచిన భారత్‌.. వరుసగా రెండు మెడల్స్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)