Breaking News

వెర్‌స్టాపెన్‌కు పోల్‌ పొజిషన్‌

Published on Sun, 09/21/2025 - 04:21

బాకు (అజర్‌బైజాన్‌): రెడ్‌బుల్‌ డ్రైవర్, ఫార్ములావన్‌ మాజీ చాంపియన్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ అజర్‌బైజాన్‌ సర్క్యూట్‌పై దూసుకెళ్లాడు. శనివారం జరిగిన రేసులో పోల్‌ పొజిషన్‌ సాధించాడు. క్వాలిఫయింగ్‌లో వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా 1 నిమిషం 41.117 సెకన్లలో ల్యాపును పూర్తిచేశాడు. ఈ సీజన్‌లో అతనికిది ఆరో పోల్‌ పొజిషన్‌ కాగా... ఏడుసార్లు చాంపియన్‌ అయిన బ్రిటన్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ (ఫెరారి)కు ఈ గ్రాండ్‌ప్రి కలిసిరాలేదు. అతను ఏకంగా 12వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. 

శనివారం జరిగిన బాకు సిటీ సర్క్యూట్‌ అత్యంత క్లిష్టంగా సాగింది. ఏకంగా ఆరు మంది రేసర్ల కార్లు ప్రమాదానికి గురయ్యాయి. చాంపియన్‌షిప్‌లో లీడర్‌బోర్డులో ఉన్న మెక్‌లారెన్‌ రేసర్‌ ఆస్కార్‌ పియాస్ట్రి కారు కూడా ప్రమాదానికి గురైంది. దీంతో ప్రధాన రేసుకు అతను దూరమయ్యాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును వెర్‌స్టాపెన్‌ మొదటి స్థానం నుంచి ప్రారంభిస్తారు. బాకు సర్క్యూట్‌ రేసర్లను బాగా ఇబ్బంది పెట్టింది.  

ప్రతికూల వాతావరణం కూడా డ్రైవర్ల కష్టాలను పెంచింది. అదేపనిగా వర్షం, రికార్డు స్థాయిలో ఏకంగా ఆరుగురు రేసర్ల కార్లు ప్రమాదానికి గురవడం ఆందోళనకు గురిచేసింది. పియాస్ట్రీ సహా, ఫెరారీ డ్రైవర్‌ లెక్‌లెర్క్, ఒలీవర్‌ బియర్మన్‌ (హాస్‌), అలెక్స్‌ అల్బన్‌ (విలియమ్స్‌), హుల్కెన్‌బర్గ్‌ (సాబెర్‌), పియెర్‌ గాస్లీ (ఆల్‌పైన్స్‌) ప్రమాదాలతో ప్రధాన రేసుకు అర్హత సాధించలేకపోయారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)