Breaking News

ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ వీరే..!

Published on Thu, 09/05/2024 - 17:44

ఆగస్ట్‌ నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ వివరాలను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్‌ 5) ప్రకటించింది. పురుషుల విభాగంలో సౌతాఫ్రికాకు చెందిన కేశవ్‌ మహారాజ్‌, వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జేడెన్‌ సీల్స్‌, శ్రీలంక ఆల్‌రౌండర్‌ దునిత్‌ వెల్లలగే అవార్డు రేసులో ఉండగా.. మహిళల విభాగంలో శ్రీలంకకు చెందిన హర్షిత సమరవిక్రమ, ఐర్లాండ్‌ ఆల్‌రౌండర్‌ ఓర్లా ప్రెండర్‌గాస్ట్‌, ఐర్లాండ్‌ ఓపెనర్‌ గాబీ లూయిస్‌ పోటీలో ఉన్నారు.

కేశవ్‌ మహారాజ్‌: ఈ దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్ట్‌ మ్యాచ్‌లలో విశేషంగా రాణించి ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు గెలుచుకున్నాడు. మహారాజ్‌ ఈ రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.

జేడెన్‌ సీల్స్‌: ఈ విండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో 12 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్‌లో సీల్స్‌ ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. తద్వారా అతను ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి ఎగబాకాడు.

దునిత్‌ వెల్లలగే: ఈ లంక ఆల్‌రౌండర్‌ గత నెలలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌ను భారత్‌ 0-2 తేడాతో కోల్పోయింది. వెల్లలగే తొలి వన్డేలో 67 నాటౌట్‌, రెండో వన్డేలో 39 మరియు రెండు వికెట్లు, మూడో వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)