Breaking News

హర్యానా స్టీలర్స్‌ హ్యాట్రిక్‌ విజయం

Published on Wed, 10/30/2024 - 22:46

హైదరాబాద్‌, 30 అక్టోబర్‌ 2024 : ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 10 రన్నరప్‌ హర్యానా స్టీలర్స్‌ పీకెఎల్‌ 11వ సీజన్లో హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన హర్యానా స్టీలర్స్‌ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో సాధికారిక విజయాలు సాధించింది. బుధవారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై 30-28తో హర్యానా స్టీలర్స్‌ గెలుపొందింది. 

నాలుగు మ్యాచుల్లో హర్యానా స్టీలర్స్‌కు ఇది మూడో విక్టరీ కాగా.. యూపీ యోధాస్‌కు ఐదు మ్యాచుల్లో ఇది రెండో పరాజయం. ఈ విజయంతో హర్యానా స్టీలర్స్‌ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానం నుంచి నాల్గో స్థానానికి ఎగబాకింది. హర్యానా స్టీలర్స్‌ ఆటగాళ్లలో రెయిడర్‌ వినయ్‌ (8 పాయింట్లు), డిఫెండర్‌ సంజయ్‌ ధుల్‌ (6 పాయింట్లు) రాణించారు. యూపీ యోధాస్‌ తరఫున గగన్‌ గౌడ ( 9 పాయింట్లు), భరత్‌ (5 పాయింట్లు) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.

ప్రథమార్థంలోనూ యూపీ యోధాస్‌పై హర్యానా స్టీలర్స్‌ పైచేయి సాధించింది. తొలి అర్థభాగం ఆటలో ఇరు జట్లకు పాయింట్లు అంత సులువుగా దక్కలేదు. కూతలో హర్యానా, యూపీ నాలుగేసి పాయింట్లు సాధించాయి. కానీ స్టీలర్స్‌ డిఫెండర్‌ సంజయ్‌ ధుల్‌ మెరుపు ట్యాకిల్స్‌ చేశాడు. హర్యానా స్టీలర్స్‌కు డిఫెన్స్‌లో ఏడు పాయింట్లు అందించాడు. దీంతో తొలి 20 నిమిషాల ఆటలో హర్యానా స్టీలర్స్‌ 11-9తో పైచేయి సాధించింది. విరామ సమయానికి రెండు పాయింట్ల ఆధిక్యంతో నిలిచింది. ద్వితీయార్థంలో స్టీలర్స్‌ ఆధిపత్యం కొనసాగినా.. ఆఖరు ఐదు నిమిషాల్లో యూపీ యోధాస్‌ నుంచి ప్రతిఘటన ఎదురైంది. పాయింట్ల లోటు నెమ్మదిగా పూడ్చకుంటూ హర్యానాపై యోధాస్‌ ఒత్తిడి పెంచింది. హర్యానా 26-24తో ముందంజలో నిలువగా.. చివరి రెండు నిమిషాల ఆటలో ఇరు జట్లు ఒక్కో పాయింట్‌ సాధిస్తూ వచ్చాయి. ఆఖరు వరకు రెండు పాయింట్ల ఆధిక్యత నిలుపుకున్న హర్యానా స్టీలర్స్‌ సీజన్లలో మూడో విజయం ఖాతాలో వేసుకుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)