Breaking News

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ ఆడనున్న పియూశ్‌ చావ్లా

Published on Fri, 08/22/2025 - 20:44

సెప్టెంబర్‌ 9న జరుగనున్న సౌతాఫ్రికా టీ20 లీగ్‌ (నాలుగో ఎడిషన్‌) వేలంలో 13 మంది భారత ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు అత్యంత ఆప్తుడు పియూశ్‌ చావ్లా.. ఐపీఎల్‌ మాజీ ఆటగాళ్లు సిద్దార్థ్‌ కౌల్‌ (ఆర్సీబీ), అంకిత్‌ రాజ్‌పుత్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌) ఉన్నారు.

మిగతా 10 మంది వివిధ రాష్ట్రాలకు చెందిన వారు. గుజరాత్‌కు చెందిన మహేశ్‌ అహిర్‌, పంజాబ్‌కు చెందిన సరుల్‌ కన్వర్‌, ఢిల్లీకి చెందిన అనురీత్‌ సింగ్‌ కతూరియా, రాజస్థాన్‌కు చెందిన నిఖిల్‌ జగా, తమిళనాడుకు చెందిన కేఎస్‌ నవీన్‌, యూపీకి చెందిన ఇమ్రాన్‌ ఖాన్‌, అతుల్‌ యాదవ్‌, రాష్ట్రాల పేర్లు పొందుపరచని అన్సారీ మరూఫ్‌, మొహమ్మద్‌ ఫైద్‌, వెంకటేశ్‌ గాలిపెల్లి సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025 వేలంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

వీరిలో పియూశ్‌ చావ్లా మినహా మిగతా ఆటగాళ్ల బేస్‌ ధర రూ. 10 లక్షలుగా నిర్ణయించబడింది. పియూశ్‌ బేస్‌ ధర రూ. 50 లక్షల రూపాయలుగా ఉంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీ వద్ద 7.4 మిలియన్ యూఎస్‌ డాలర్ల పర్స్‌ ధర మిగిలి ఉండగా.. 84 మంది ఆటగాళ్లను వేలం ద్వారా తీసుకునే అవకాశం ఉంది.

కాగా, భారత ఆటగాళ్లు సౌతాఫ్రికా లీగ్‌ సహా ప్రపంచంలో ఏ ఇతర ప్రైవేట్‌ లీగ్‌లో ఆడాలన్నా బీసీసీఐ నిబంధనల ‍ప్రకారం భారత క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌తో పూర్తి బంధాన్ని తెంచుకోవాలి. ఒక్కసారి ఎవరైనా భారత ఆటగాడు వేరే దేశం లీగ్‌లో ఆడితే, భారత క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌ ఆడే అర్హత కోల్పోతాడు. ఏ భారత ఆటగాడైనా ఇతర దేశాల లీగ్‌ల్లో పాల్గొనాలనుకుంటే భారత క్రికెట్‌కు సంబంధించి అన్ని విభాగాలకు రిటైర్మెంట్‌ ప్రకటించి ఉండాలి. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)