Breaking News

అందరూ అయిపోయారు.. విరాట్‌ కోహ్లి ఒక్కడే మిగిలాడు..!

Published on Fri, 06/06/2025 - 19:32

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ పియుశ్‌ చావ్లా ఇవాళ (జూన్‌ 6) క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్లలో సభ్యుడైన పియుశ్‌.. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాలీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 

పియుశ్‌ రిటైర్మెంట్‌ ప్రకటన అనంతరం సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికర అంశం వైరలవుతుంది. పియుశ్‌ రిటైర్మెంట్‌ తర్వాత 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టు సభ్యుల్లో ఇంకొకరు మాత్రమే ఇంకా కెరీర్‌ను (వన్డే) కొనసాగిస్తున్నారు. అతనెవరో కాదు పరుగుల యంత్రం, రికార్డుల రారాజు, తాజా ఐపీఎల్‌ విన్నర్‌ విరాట్‌ కోహ్లి.

2011 ప్రపంచకప్‌ కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించగా.. పియుశ్‌ రిటైర్మెంట్‌ తర్వాత విరాట్‌ కోహ్లి ఒక్కడే మిగిలి ఉన్నాడు (రిటైర్‌ కాకుండా). ఓసారి నాటి వరల్డ్‌కప్‌ వి​న్నింగ్‌ భారత జట్టుపై ఓ లుక్కేద్దాం. నాడు టీమిండియా మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఆ జట్టులో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండ్కూలర్‌ కూడా ఉన్నాడు. సచిన్‌కు అదే చివరి వరల్డ్‌కప్‌.

సచిన్‌తో పాటు వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌, విరాట్‌ కోహ్లి, యువరాజ్‌ సింగ్‌, ధోని, సురేశ్‌ రైనా, యూసఫ్‌ పఠాన్‌, హర్భజన్‌ సింగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, పియుశ్‌ చావ్లా, ఆశిష్‌ నెహ్రా, జహీర్‌ ఖాన్‌, మునాఫ్‌ పటేల్‌, శ్రీశాంత్‌ టీమిండియాలో ఉన్నారు. ఇవాల్టితో ఆ 15 మంది సభ్యుల్లో 14 మంది రిటైరైపోయి కోచింగ్‌, ఇతరత్రా బాధ్యతల్లో ఉండగా.. విరాట్‌ ఒక్కడే వన్డే కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. విరాట్‌ ఇటీవలే టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.

నాటి వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌ శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో గెలుపొంది, తమ రెండో వన్డే వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేయగా.. భారత్‌ మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి జగజ్జేతగా అవతరించింది. ధోని సిక్సర్‌ కొట్టి ఆ మ్యాచ్‌ను ముగించాడు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో జయవర్దనే అజేయ సెంచరీతో కదంతొక్కగా.. భారత ఇన్నింగ్స్‌లో గంభీర్‌, ధోని 90ల్లో నిలిచారు. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)