Breaking News

ఫిల్‌ సాల్ట్‌ ఊచకోత.. ఒకే ఓవర్‌లో 30 పరుగులు! వీడియో వైరల్‌

Published on Thu, 06/20/2024 - 13:50

టీ20 వరల్డ్‌కప్‌-2024లో సెయింట్‌ లూసియా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ విధ్వంసం సృష్టించాడు. 181 పరుగుల లక్ష్య చేధనలో సాల్ట్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కరేబియన్‌ బౌలర్లకు సాల్ట్‌ చుక్కలు చూపించాడు.

ముఖ్యంగా విండీస్‌ ఆల్‌రౌండర్‌ రొమారియో షెపర్డ్‌ను ఊచకోత కోశాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ వేసిన షెపర్డ్‌ బౌలింగ్‌లో సాల్ట్‌  4,6,4,6,6,4 బాది ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. దీంతో మ్యాచ్‌ స్వరూపం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. 

ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న సాల్ట్‌.. 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 87 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా విండీస్‌పై టీ20ల్లో సాల్ట్‌కు ఘనమైన రికార్డు ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో సాల్ట్ ఇప్పటివరకు 26 ఇన్నింగ్స్​ల్లో 844 పరుగులు చేయగా అందులో 50 శాతానికి పైగా విండీస్​పై బాదినవే కావడం విశేషం.

విండీస్‌పై ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌లు ఆడిన సాల్ట్‌ 487 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో విండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది.
చదవండి: T20 WC: అఫ్గాన్‌తో మ్యాచ్‌.. టీమిండియాలో కీలక మార్పు! సిరాజ్‌కు నో ఛాన్స్‌
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)