సరికొత్త టోర్నమెంట్‌ను ప్రకటించిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు

Published on Mon, 07/27/2026 - 21:18

దక్షిణాఫ్రికా, జింబాబ్వే వేదికలుగా జరగనున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2027 టోర్నీ దృష్ట్యా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ​ఓ కీలక నిర్ణయం తీసుకుంది.  వైట్ బాల్ క్రికెట్‌లో యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు విస్తృత అవకాశాలు కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా 'నేషనల్ ఛాంపియన్స్ కప్ 2026' అనే సరికొత్త టోర్నమెంట్‌ను పీసీబీ తీసుకొచ్చింది.

సోమవారం ఈ లీగ్ ప్రారం‍భ ఎడిషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పీసీబీ విడుదల చేసింది. షెడ్యూల్‌తో పాటు పాల్గోనే మొత్తం నాలుగు జట్లను కూడా ప్రకటించారు. ఈ టోర్నీ ఆగస్టు 11 నుంచి ఆగస్టు 18 వరకు కేవలం వారం రోజుల పాటు జరగనుంది.  మొత్తం మ్యాచ్‌లన్నింటికి  ముల్తాన్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

ఈ ఈవెంట్ లీగ్ ద‌శ‌ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో ఫార్మాట్‌లో నిర్వ‌హించ‌నున్నారు.  ప్రతీ జట్టు మిగతా జట్లతో ఒకసారి త‌ల‌ప‌డ‌నుంది. లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఆగస్టు 18న జరిగే గ్రాండ్ ఫైనల్‌లో తాడోపేడో తెల్చుకోనున్నాయి. 

కాగా ఈ లిస్ట్‌-ఎ క్రికెట్ టోర్న‌మెంట్‌లో పాకిస్తాన్ అగ్ర‌శ్రేణి ఆట‌గాళ్లు షాహీన్ షా అఫ్రిది,  షాదాబ్ ఖాన్, సైమ్ అయూబ్, సాహిబ్‌జాదా ఫర్హాన్ పాల్గోనున్నారు. వీరు నలుగురు కెప్టెన్లగా వ్యవహరించనున్నారు.

జట్ల వివరాలు:
పాకిస్థాన్ గ్రీన్: షాదాబ్ ఖాన్ (కెప్టెన్), ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఫర్హాన్ యూసుఫ్, మెహ్రాన్ ముంతాజ్, మహమ్మద్ హస్నైన్, మహమ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, ఉమైర్ బిన్ యూసుఫ్, సాద్ బైగ్ (వికెట్ కీపర్), సమీర్ మిన్హాస్.

పాకిస్థాన్ వైట్స్: సైమ్ అయూబ్ (కెప్టెన్), ఆకిఫ్ జావేద్, అలీ రజా, హ్యారీస్ రౌఫ్, హసన్ నవాజ్, ఖుష్‌దిల్ షా, మొహ్సిన్ రియాజ్, మహమ్మద్ వసీమ్ జూనియర్, సాద్ మసూద్, షెహ్‌జాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).

పాకిస్థాన్ బ్లూస్: సాహిబ్‌జాదా ఫర్హాన్ (కెప్టెన్), అహ్మద్ దానియల్, అరఫాత్ మిన్హాస్, హసన్ అలీ, హుస్సేన్ తలాత్, జహాన్ దాద్ ఖాన్, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్), షామిల్ హుస్సేన్, సుఫియాన్ మోకిమ్, తైమూర్ ఖాన్ (వికెట్ కీపర్), తయ్యాబ్ తాహిర్.

పాకిస్థాన్ గోల్డ్: షాహీన్ షా అఫ్రీది (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్దుల్ సుభాన్, ఫైసల్ అక్రమ్, హైదర్ అలీ, కమ్రాన్ గులామ్, మాజ్ సదాకత్, మహమ్మద్ నవాజ్, ముహమ్మద్ అఖ్లాక్ (వికెట్ కీపర్), ముహమ్మద్ ఇమ్రాన్, సాద్ ఖాన్.
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)