Breaking News

అత‌డొక క్లాస్ ప్లేయ‌ర్‌.. ఎంత‌ చెప్పుకున్న త‌క్కువే: ప్యాట్ క‌మ్మిన్స్‌

Published on Mon, 05/20/2024 - 12:24

ఐపీఎల్‌-2024లో త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అద‌ర‌గొట్టింది. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘ‌న విజ‌యం సాధించింది. 215 ప‌రుగుల  భారీ ల‌క్ష్యాన్ని ఎస్ఆర్‌హెచ్ సునాయ‌సంగా చేధించింది. 

ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో స‌న్‌రైజ‌ర్స్ రెండో స్ధానంలో నిలిచింది. దీంతో మే 21న అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి క్వాలిఫియ‌ర్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇక పంజాబ్‌పై విజ‌యంపై మ్యాచ్ అనంత‌రం ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ స్పందించాడు.

"మా హోం గ్రౌండ్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం చాలా సంతోషంగా ఉంది. మా జ‌ట్టును స‌పోర్ట్ చేసేందుకు మైదానంకు వ‌చ్చిన అభిమానులంద‌రికి ధ‌న్య‌వాదాలు. ఇంత ఫ్యాన్ కలిగి ఉన్న టీమ్‌ను ఎక్క‌డ నేను చూడ‌లేదు. 

మేము మా సొంత మైదానంలో 7 మ్యాచ్‌ల్లో ఆరింట విజ‌యాలు సాధించాము. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టివర‌కు మా కుర్రాళ్లు అద్బుతంగా రాణించారు. ప్ర‌తీ ఒక్క‌రూ జ‌ట్టు విజ‌యాల్లో త‌మ వంతు పాత్ర పోషించారు. ఇక అభిషేక్ గురుంచి ఎంత చెప్పుకున్న త‌క్కువే. 

అత‌డికి అద్భుత‌మైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఫియ‌ర్ లెస్ క్రికెట్ ఆడుతాడు. అత‌డి బ్యాటింగ్ విధ్వంసానికి ప్ర‌తీ ఒక్క బౌల‌ర్ భ‌య‌ప‌డాల్సిందే. నేను కూడా అభిషేక్‌కు బౌలింగ్ చేయాలనుకోవడం లేదు. పేసర్లకే కాదు స్పిన్నర్లపై కూడా అత‌డు స్వేచ్ఛగా ఆడుతాడు. 

ఇక నితీష్ ఒక యువ సంచ‌ల‌నం. అత‌డొక  ఒక క్లాస్ ప్లేయర్. అత‌డి త‌న అనుభ‌వానికి మించి ఆడుతున్నాడు. అతను మా టాప్-ఆర్డర్‌లో కీల‌క ఆట‌గాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో కూడా ఇదే రిథ‌మ్‌ను కొన‌సాగించ‌డానికి ప్ర‌య‌త్నిస్తామ‌ని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో క‌మ్మిన్స్ పేర్కొన్నాడు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు