సన్ రైజర్స్‌ సంచలన నిర్ణయం.. మార్‌క్రమ్‌కు బిగ్‌ షాక్‌! కొత్త కెప్టెన్‌ అతడే?

Published on Sat, 03/02/2024 - 17:57

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  వేలంలో రూ.20.50 కోట్టు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ఆసీస్‌ స్టార్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌కు తమ జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న ఐడైన్‌ మార్‌క్రమ్‌ను తప్పించేందుకు ఎస్‌ఆర్‌హెచ్‌ సిద్దమైనట్లు వినికిడి.

ఈ విషయంపై ఒకట్రెండు రోజుల్లో ఆరెంజ్‌ ఆర్మీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. కాగా కెప్టెన్‌గా కమ్మిన్స్‌కు ఉన్న అనుభవం దృష్ట్యా.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కమిన్స్ కెప్టెన్‌గానే కాకుండా ఫ్రంట్ లైన్ బౌలర్‌గా సన్‌రైజర్స్‌కు కీలకం కానున్నాడు. 

కాగా కమ్మిన్స్‌ సారథ్యంలోనే వన్డే ప్రపంచకప్‌-2023ను, వరల్డ్‌టెస్టు ఛాంపియన్‌ షిప్‌ టైటిల్‌ను ఆసీస్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మార్‌క్రమ్‌ సైతం దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో వరుసగా రెండు సార్లు ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ను ఛాంపియన్స్‌గా నిలిపాడు. కానీ ఐపీఎల్‌లో మాత్రం మార్‌క్రమ్‌ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. గతేడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు పగ్గాలను చేపట్టిన మార్‌క్రమ్‌ జట్టును విజయ పథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. అతడి సారథ్యంలో సన్‌రైజర్స్‌ 14 మ్యాచ్‍ల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)