Breaking News

SRH Vs DC: ప్యాట్‌ కమ్మిన్స్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే

Published on Mon, 05/05/2025 - 21:21

ఐపీఎల్‌-2025లో ఉప్ప‌ల్ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బంతితో మ్యాజిక్ చేశాడు. త‌న అద్బుత బౌలింగ్‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ టాప‌ర్డ‌ర్‌ను కుప్ప‌కూల్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే క‌రుణ్ నాయ‌ర్‌ను ఔట్ చేసి త‌న జ‌ట్టుకు అద్బుత‌మైన ఆరంభాన్ని ఇచ్చాడు.

ఆ త‌ర్వాత మూడో ఓవ‌ర్ మొద‌ట బంతికి ఫాఫ్ డుప్లెసిస్‌, ఐదో ఓవ‌ర్ మొద‌టి బంతికి అభిషేక్ పోరెల్‌ను క‌మ్మిన్స్ పెవిలియ‌న్‌కు పంపాడు. క‌మ్మిన్స్‌ ఓవ‌రాల్‌గా త‌న 4 ఓవ‌ర్ల కోటాలో 19 ప‌రుగులిచ్చి 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ క్ర‌మంలో క‌మ్మిన్స్ ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.

 ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్ పవర్ ప్లేలో  అత్య‌ధిక వికెట్లు తీసిన కెప్టెన్‌గా క‌మ్మిన్స్ చ‌రిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఒక ఇన్నింగ్స్ పవర్ ప్లే ఏ కెప్టెన్ కూడా మూడు వికెట్లు సాధించలేకపోయాడు. అక్షర్ పటేల్‌(ఢిల్లీ క్యాపిటల్స్‌), జహీర్ ఖాన్‌(ఢిల్లీ క్యాపిటల్స్‌), షాన్ పోలాక్‌(ముంబై ఇండియన్స్‌) వంటి కెప్టెన్లు ఐపీఎల్ ఇన్నింగ్స్ పవర్ ప్లేలో 2 వికెట్లు పడగొట్టారు. తాజా మ్యాచ్‌తో ఈ త్రయాన్ని కమ్మిన్స్ అధిగమించాడు.

మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నామ‌మాత్ర‌పు స్కోర్‌కే ప‌రిమిత‌మైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన 7 వికెట్ల న‌ష్టానికి ఢిల్లీ 133 ప‌రుగులు చేసింది. 29 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన ఢిల్లీని స్ట‌బ్స్‌(41 నాటౌట్‌), ఆశుతోష్ శ‌ర్మ‌(41) ఆదుకున్నారు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో క‌మ్మిన్స్ మూడు, ఉన‌ద్క‌ట్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, మలింగ తలా వికెట్ సాధించారు.

 

Videos

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు