Breaking News

3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌ ఫైనల్లో పారుల్‌ 

Published on Fri, 08/25/2023 - 13:50

బుడాపెస్ట్‌ (హంగేరి): ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌ ఈవెంట్‌లో భారత అథ్లెట్‌ పారుల్‌ చౌధరీ ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన హీట్స్‌లో పారుల్‌ ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంది.

రెండో హీట్‌లో పోటీపడ్డ పారుల్‌ తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పారుల్‌ 9 నిమిషాల 24.29 సెకన్లలో గమ్యానికి చేరి ఐదో స్థానంలో నిలిచింది. మొత్తం మూడు హీట్స్‌ నిర్వహించారు. ప్రతి హీట్‌లో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు ఫైనల్‌కు అర్హత పొందారు. ఫైనల్‌ ఆదివారం జరుగుతుంది. 

మరోవైపు పురుషుల లాంగ్‌జంప్‌ ఈవెంట్‌ ఫైనల్లో భారత అథ్లెట్‌ జెస్విన్‌ ఆ్రల్డిన్‌ నిరాశపరిచాడు. 12 మంది పాల్గొన్న ఫైనల్లో జెస్విన్‌ తొలి రెండు ప్రయత్నాల్లో ఫౌల్‌ చేశాడు. మూడో ప్రయత్నంలో 7.77 మీటర్ల దూరం దూకి 11వ స్థానంలో నిలిచాడు.
చదవండి: Asia Cup 2023: విరాట్‌ కోహ్లికి బీసీసీఐ వార్నింగ్‌.. కారణమిదే! మరోసారి అలా చేయొద్దంటూ!

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి