Breaking News

శెభాష్‌ మనూ! మరో పతకానికి గురి.. చరిత్రకు అడుగుదూరంలో

Published on Mon, 07/29/2024 - 16:17

భారత షూటింగ్‌ జోడీ మనూ భాకర్‌- సరబ్‌జోత్‌ సింగ్‌ ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో శుభారంభం చేశారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సోమవారం నాటి క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో మూడో స్థానంలో నిలిచారు. తద్వారా మనూ- సరబ్‌జోత్‌ కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు. 

ఇద్దరూ కలిసి 580 పాయింట్లు స్కోరు చేసి.. బ్రాంజ్‌ మెడల్‌ పోటీలో నిలిచారు. అయితే, ఈ ఈవెంట్లో మరో జోడీ రిథమ్‌ సంగ్వాన్‌- అర్జున్‌ సింగ్‌ చీమా మాత్రం పూర్తిగా నిరాశపరిచారు. టాప్‌-3కి చేరుకోలేక రేసు నుంచి నిష్క్రమించారు.  మరోవైపు.. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వుమెన్స్‌ మెడల్‌ ఈవెంట్లో రమితా జిందాల్‌ నిరాశపరిచింది. మెడల్‌ రౌండ్‌కు ఆమె అర్హత సాధించలేకపోయింది.

చరిత్రకు అడుగు దూరంలో మనూ భాకర్‌
10 మీటర్ల వుమెన్స్‌ ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో 22 ఏళ్ల మనూ భాకర​ కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. తద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా షూటర్‌గా చరిత్ర సృష్టించిన ఈ హర్యానా అమ్మాయి.. మరో పతకానికి గురిపెట్టింది.

సరబ్‌జోత్‌తో కలిసి 10 మీటర్ ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. మంగళవారం(మద్యాహ్నం ఒంటి గంటకు) జరుగనున్న ఈ పోటీలో గనుక మనూ- సరబ్‌జోత్‌ గెలిస్తే సరికొత్త చరిత్ర ఆవిష్కృతమవుతుంది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన భారత తొలి మహిళా అథ్లెట్‌గా మనూ భాకర్‌ రికార్డు సృష్టిస్తుంది. 

శతాబ్దం తర్వాత
అదే విధంగా.. ఈ ఘనత సాధించిన రెండో భారత ప్లేయర్‌గా నిలుస్తుంది. 1900 ఒలింపిక్స్‌లో బ్రిటిష్‌- ఇండియన్‌ నార్మన్‌ పిచార్డ్‌ 200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హార్డిల్స్‌లో కలిపి రెండు రజత పతకాలు సాధించాడు. ఇప్పటి వరకు ఆ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. మనూ ఇప్పుడు రికార్డు బ్రేక్‌ చేయగల అరుదైన రికార్డు ముంగిట నిలిచింది. 

Videos

తాడిపత్రిలో జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల అధికారులు

కోమటిరెడ్డి Vs అనిరుధ్ రెడ్డి.. డిండి నీళ్ల పంచాయితీ

Fire accident : చార్మినార్ ప‌రిధిలో భారీ అగ్నిప్రమాదం

కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. తప్పిన పెను ప్రమాదం

తెలుగు ప్రజలకు YS జగన్ దసరా శుభాకాంక్షలు

పులివెందులలో ఖాకీ కుట్ర.. YSRCP శ్రేణులపై ఏకే 47తో కాల్పులు..

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)