Breaking News

భారత్‌ నుంచి ఒక్కరే... ఒలింపిక్స్‌లో రఘు ప్రసాద్‌! ప్రతిష్టాత్మక ఈవెంట్లో నీరజ్‌..

Published on Thu, 09/14/2023 - 09:52

Paris Olympics 2024: వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో హాకీ ఈవెంట్‌లో విధులు నిర్వహించే అంపైర్ల వివరాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రకటించింది. పురుషుల, మహిళల మ్యాచ్‌లకు కలిపి మొత్తం 28 మంది అంపైర్లును ఎంపిక చేశారు.

భారత్‌ నుంచి రఘు ప్రసాద్‌ ఒక్కడే అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వహించేందుకు ఎంపికయ్యాడు. 2003 నుంచి అంపైర్‌గా వ్యవహరిస్తున్న రఘు 186 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అంపైర్‌గా పని చేశాడు. 2012 లండన్, 2021 టోక్యో ఒలింపిక్స్‌లోనూ రఘు ప్రసాద్‌ అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వహించాడు.    

నీరజ్‌ చోప్రా ఒక్కడే
ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ మీట్‌ ఫైనల్స్‌లో భారత్‌ నుంచి జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా మాత్రమే పోటీపడుతున్నాడు. అవినాశ్‌ సాబ్లే (3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌), మురళీ శ్రీశంకర్‌ (లాంగ్‌జంప్‌) కూడా అర్హత సాధించినా ఆసియా క్రీడల నేపథ్యంలో ఈ ఇద్దరు దూరంగా ఉన్నారు. ఈనెల 16, 17వ తేదీల్లో అమెరికాలోని యుజీన్‌లో ఈ ఫైనల్స్‌ జరుగుతాయి. గత ఏడాది జ్యూరిక్‌లో జరిగిన డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో నీరజ్‌ జావెలిన్‌ త్రో ఈవెంట్‌ స్వర్ణ పతకం సాధించాడు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)