Breaking News

Olympics 2024: ప్రి క్వార్టర్స్‌ చేరిన పీవీ సింధు

Published on Wed, 07/31/2024 - 14:01

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు మరో ముందడుగు వేసింది. మహిళల సింగిల్స్‌ విభాగంలో గ్రూప్‌- ఎమ్‌ టాపర్‌గా రౌండ్‌ ఆఫ్‌ 16లో అడుగుపెట్టింది. గ్రూప్‌ దశలో బుధవారం నాటి మ్యాచ్‌లో ఎస్టోనియా షట్లర్‌ క్రిస్టిన్‌ కౌబాను 21-5, 21-10తో ఓడించి ప్రి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.

ఆది నుంచే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ ఆడుతూ పాడుతూ సింధు గెలుపొందింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌ కేవలం 34 నిమిషాల్లోనే ముగిసిపోవడం విశేషం. కాగా తన తొలి మ్యాచ్‌లో సింధు.. మాల్దీవుల షట్లర్‌ ఫాతిమాత్‌ నబాహ అబ్దుల్‌ రజాక్‌ను 21-9, 21-6తో ఓడించింది. 

ఇక ప్యారిస్‌ ఒలింపిక్స్‌ ప్రి క్వార్టర్స్‌లో సింధు.. గ్రూప్‌-ఎన్‌ టాపర్‌, చైనాకు చెందిన హి బింగో జియావోను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌ గురువారం జరుగనుంది. ఇదిలా ఉంటే.. టోక్యోలో వీరిద్దరు కాంస్యం కోసం పోటీపడగా సింధు పైచేయి సాధించిన విషయం తెలిసిందే.

కాగా తెలుగు తేజం పీవీ సింధు ఇప్పటికే రెండు ఒలింపిక్‌ పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. రియో ఒలింపిక్స్‌-2016లో రజతం సాధించిన ఈ స్టార్‌ షట్లర్‌.. టోక్యో ఒలింపిక్స్‌-2020లో కాంస్య పతకం గెలిచింది. ముచ్చటగా మూడో మెడల్‌ మెడలో వేసుకోవాలని పట్టుదలగా ఉన్న పీవీ సింధు.. ఆ దిశగా వరుస విజయాలతో దూసుకుపోతోంది.

చదవండి: మను మహరాణి

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)