Breaking News

Paris Olympics 2024: స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న జకోవిచ్‌

Published on Sun, 08/04/2024 - 21:03

పారిస్‌ ఒలింపిక్స్‌ పురుషుల టెన్నిస్‌ సింగిల్స్‌ పోటీల్లో సెర్బియా యోధుడు నొవాక్‌ జకోవిచ్‌ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇవాళ (ఆగస్ట్‌ 4) జరిగిన ఫైనల్లో స్పెయిన్‌ యువకెరటం కార్లోస్‌ అల్‌కరాజ్‌పై వరుస సెట్లలో (7-6(3), 7-6(2)) విజయం సాధించాడు. ఒలింపిక్స్‌లో జకోకు ఇది తొలి స్వర్ణం. 37 ఏళ్ల జకో ఒలింపిక్స్‌ స్వర్ణం నెగ్గిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. 

అలాగే కెరీర్‌ గోల్డెన్‌ స్లామ్‌ (నాలుగు గ్రాండ్‌స్లామ్‌లతో పాటు ఒలింపిక్స్‌ సింగిల్స్‌లో స్వర్ణం) నెగ్గిన ఐదో టెన్నిస్‌ క్రీడాకారుడిగా చరిత్రపుటల్లోకెక్కాడు. ఇటీవలి కాలంలో అల్‌కరాజ్‌.. జకోవిచ్‌పై ఆధిపత్యం చాలాయించాడు. 2023, 2024 వింబుల్డన్‌లో అల్‌కరాజ్‌ జకోకు షాకిచ్చాడు. ఈ రెండు పరాజయాలకు జకో విశ్వవేదికపై బదులు తీర్చుకున్నాడు. జకో తన కెరీర్‌లో24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించగా.. అల్‌కరాజ్‌ చిన్నవయసులోనే నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు తన ఖాతాలో కలిగి ఉన్నాడు. ఒలింపిక్స్‌ ఫైనల్లో ఓటమితో అల్‌కరాజ్‌ రజత పతకంతో సరిపుచ్చుకున్నాడు. 
 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)