Breaking News

Olympics 2024: క్వార్టర్‌ ఫైనల్లో భారత రెజ్లర్‌

Published on Sat, 08/10/2024 - 15:44

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో మరో భారత రెజ్లర్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. మహిళల 76 కేజీల విభాగంలో రౌండ్‌ ఆఫ్‌ 16(ప్రిక్వార్టర్స్‌)కు అర్హత సాధించిన రితికా హుడా.. హంగేరికి చెందిన బెర్నాడెట్‌ న్యాగీతో తలపడింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ బౌట్‌లో బెర్నాడెట్‌పై 12-2తో రితికా పైచేయి సాధించింది.

ఈ క్రమంలో.. ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ పద్ధతిలో రితికా హుడాను విజేతగా ప్రకటించారు. ఫలితంగా ఆమె క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. కాగా బౌట్‌ జరుగుతున్నపుడు ఇద్దరు రెజ్లర్ల మధ్య 10 పాయింట్ల తేడా వచ్చిన వెంటనే.. రిఫరీ బౌట్‌ను నిలిపి వేసి.. పది పాయింట్ల ఆధిక్యంలో ఉన్న రెజ్లర్‌ను ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా తేలుస్తారు. క్వార్టర్‌ ఫైనల్లో రితిక.. కిర్గిస్తాన్‌కు చెందిన ఐపెరి మెడిట్‌ కిజీతో తలపడనుంది.

ఇప్పటికి ఆరు 
కాగా ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత యువ రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. పురుషుల 57 కేజీల విభాగంలో మూడో స్థానం సాధించిన అమన్‌ భారత్‌ పతకాల సంఖ్యను ఆరుకు చేర్చాడు. ఇక మరో రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ సైతం 50 కేజీల ఫ్రీస్టయిల్‌ విభాగంలో ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. 

అయితే, వెయింగ్‌ రోజున 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందన్న కారణంగా స్వర్ణ పతక బౌట్‌లో పాల్గొనకుండా ఆమెపై అనర్హత వేటు పడింది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు భారత్‌కు ప్యారిస్‌లో ఐదు కాంస్యాలు(షూటింగ్‌లో మూడు, హాకీ ఒకటి, రెజ్లింగ్‌లో ఒకటి), ఒక రజతం(నీరజ్‌ చోప్రా- జావెలిన్‌ త్రో) వచ్చాయి.

చదవండి: CASలో ముగిసిన వినేశ్‌ కేసు వాదనలు.. ప్రకటన విడుదల

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)